Tuesday, April 12, 2011

హోమియో మందులు

కొన్ని అత్యవసర కేసుల్లో హోమియో మందులు చాలా వేగంగా పనిచేస్తాయి. కానీ, హోమియో మందులు చాలా నిదానంగా పనిచేస్తాయనే అపోహలు కొందరిలో ఉన్నాయి. ఆ అపోహలు ఏర్పడటానికి గల కారణాల్లోకి వెళితే,హోమియో చికిత్స కోసం వచ్చే వారిలో 90 శాతం మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారే ఉంటారు. కొన్నేళ్లుగా ఒక సమస్యతో బాధపడుతూ రకరకాల వైద్య చికిత్సలూ తీసుకుని ఎక్కడా తగ్గకపోతేనే చిట్టచివరగా హోమియో కోసం వస్తుంటారు. అన్నేళ్లుగా ఉన్న ఏ సమస్య అయినా ఒకటి రెండు రోజుల్లో ఎలా తగ్గుతుంది ? అది దీర్ఘకాలిక సమస్య కావడం చేతే చికిత్సా కాలం పెరిగింది అనే విషయంలోకి ఎవరూ వెళ్లరు. హోమియో చికిత్సా విధానంలోనే ఏదో లోపం ఉన్నట్లు మాట్లాడేస్తుంటారు.


వాస్తవానికి మిగతా వైద్య విధానాల్లో ఇచ్చే మందుల కన్నా హోమియో మందులే చాలా వేగంగా పనిచేస్తాయి. కారణం అది పని చేసే విధానమే. ఇతర వైద్య వి«ధానాల్లో ఇచ్చే మాత్రలు ముందు జీర్ణకోశంలోకి వెళ్లి ఆ తరువాతే రక్తంలోకి వెళతాయి. అప్పుడే రుగ్మత మీద ప్రభావం చూపుతాయి. హోమియో మందులకు ఆ అవసరం లేదు. మాత్ర వేసుకున్న వెంటనే నోటి టోని మ్యూకస్ మెంబ్రేన్ పొరనుంచి మందు లోనికి వెళుతుంది. ఆతరువాత నరాల చివర ల్లోంచి నేరుగా శరీరంలోకి ప్రవే శిస్తుంది.

అందుకే క్షణాల్లోనే దాని ప్రభావం కనిపిస్తుంది. అందువల్ల హోమియో మందులు ఆలస్యంగా పనిచేస్తాయనే అపోహనుంచి బయటపడితే అత్యవసర సమయాల్లోనూ వీటి ప్రయోజనాన్ని పొందవచ్చు. మిగతా మందులతో పోలిస్తే హోమియో మందులకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. అటుఇటుగా చిన్న సైజు మాత్రల సీసా 10 రూపాయలకు దొరుకుతుంది. మదర్ టించర్ ఉండే చిన్న సీసా 30 రూపాయలకు దొరుకుతుంది. ఈ మందులేవీ ఒక్కసారికే అయిపోవు. మిగిలిన వాటిని మరెప్పుడైనా అదే సమస్య వస్తే వాడుకోవచ్చు.


చర్మం కొట్టుకుపోతే...
చిన్న పిల్లలు ఆడుతున్నప్పుడో, పరుగెత్తుతున్నప్పుడో కిందపడిపోయి మోకాళ్లు, మోచేతులు డోక్కుపోయి రక్తం వస్తూ ఉంటుంది. అలాంటి స్థితిలో శుభ్రమైన నీటితో దెబ్బ తగిలిన భాగాన్ని కడిగేసి 'కేలండుల్లా (మదర్ టించర్ ) ద్రావణం ఒక స్పూను గోరు వెచ్చని మంచి నీళ్లు ఒక స్పూను తీసుకుని ఈ రెండూ క లిపి ఈ ద్రావణంతో ఆ గాయాన్ని శుభ్రం చేయాలి. అలా రోజుకు మూడు సార్లు చేస్తే ఆ గాయం మానిపోతుంది.

దీనితో పాటే మెర్క్‌సాల్-30 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున మూడుసార్లు వేసుకోవాలి. దీని వల్ల ఆ గాయం చీముపట్టదు తొందరగా మానిపోతుంది. కింద పడిపోయినప్పుడు ఒక్కోసారి చర్మం చిట్లకుండానే రక్తం రాకుండానే వాపు వస్తుంది. బాగా నొప్పి ఉంటుంది. అలా వాపు రావడానికి చర్మం కింద రక్తం గడక్డకట్టడమే కారణం. ఇలాంటి వారికి ఆర్నికా-30 మందును ప్రతి నాలుగు గంటలకు ఒకసారి చొప్పున మూడు సార్లు వేస్తే తగ్గిపోతుంది.


మొలలు గుచ్చుకుని...
ఒక్కోసారి నడుస్తున్నప్పుడు పాదాలకు మొల గానీ, గాజుపెంకు గానీ, మొన వాడిగా ఉండే మరేదైనా కుచ్చుకుంటుంది. ఇలా గుచ్చుకున్న చోట తీవ్రమైన నొప్పి ఉంటుంది. వీరికి లెడంపాల్-30 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున మూడు నాలుగు సార్లు వేసుకుంటే తగ్గిపోతుంది.

వేలికొసలు చితికి పోతే...
కారు డోరుగానీ, తలుపులూ, కిటికీలు పడిగానీ ఒక్కోసారి వేలి కొసల్లోని చర్మం ఒరుసుకుపోతుంది. పైకి గాయమేమీ పెద్దగా కనపడదు. రక్తం కూడా రాదు.కానీ భరించలేనంత బాధగా ఉంటుంది. వేళ్లనుంచి మొదలై చేయంతా లాగేస్తూ ఉంటుంది. ప్రమాదాల్లో వే ళ్ల చివర్లో ఉండే నరాల చివరలు చితికి పోతాయి. అందుకే నొప్పి అంత తీవ్రంగా ఉంటుంది. ఈ స్థితిలో హైపరికం-30 మందును ప్రతి నాలుగు గంటలకు ఒక డోసు చొప్పున ఓ ఆరుసార్లు వేస్తే నొప్పి తగ్గిపోతుంది.


వంటగది వెతలు
వంటచేసే సమయంలో కొన్ని సార్లు స్టౌ తాకి గానీ, పెనం తాకి గానీ వేళ్లు గానీ,అరచేతి పై భాగాల్లో కానీ, కాలుతుంది. వీరికి కేంథారిస్ మదర్ టించర్ ద్రావణం ఒక స్పూను గోరు వెచ్చని నీళ్లు ఒకస్పూను తీసుకుని రెండూ కలిపి గాయంమీద పూస్తే అది మానిపోతుంది. ఒకవేళ వెంటనే ఇలా చేయకపోతే రెండు మూడు రోజుల్లో ఆ భాగంలో బొబ్బలు వస్తాయి. ఆ స్థితిలో కేంథారిస్ ఆయింట్‌మెంట్‌ను రోజుకు రెండు మూడు సార్లు రాస్తే తగ్గిపోతుంది.

గొంతు బొంగురుపోతే....
గట్టిగా అరిచి మాట్లాడటం వల్ల గానీ, ఎక్కువ సేపు ఉపన్యాసం ఇవ్వడం వల్ల గానీ కొందరికి గొంతు బొంగురు పోతుంది. ఈ స్థితిలో ఆరమ్ ట్రిఫ్-30 మందును ప్రతి నాలుగు గంటలకు ఒకసారి అలా నాలుగైదు రోజులు వేసుకుంటే గొంతు చక్కబడుతుంది.

ఎండలో తిరిగి..
ఎక్కువ సేపు ఎండలో తిరుగుతూ కూడా కొందరు అవసరమైన పరిమాణంలో నీరు తాగరు. దీని వల్ల ఆ మరుసటి రోజు మూత్రం ఎర్రగా వస్తూ బాగా మంటగా ఉంటుంది. వీరు కేంథారిస్-30 మందును ప్రతి నాలుగు గంటలకూ ఒక డోసు చొప్పున ఐదారు డోసులు వేసుకుంటే మంట తగ్గిపోతుంది. అయితే మందులతోనే సరిపెట్టకుండా నీళ్లు కూడా బాగా తాగాలి.

ఆహారం పడక...
హోటల్ భోజనంలోనో, విందు భోజనంలోనో మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో ఏదో ఒకటి పడక ఆ మరుసటి రోజు కడుపు నొప్పి వచ్చి విరేచనాలు మొదలవుతాయి. కడుపునొప్పి, విరేచనాలు క లిసి ఉంటే నక్స్‌వామికా-30 మందును ప్రతి మూడు గంటలకు ఒక డోసు చొప్పున సమస్య తీవ్రంగా ఉంటే ఇంకాస్త ముందు కూడా వేయవచ్చు. నొప్పి లేకుండా నీళ్లల్లా విరేచనాలు అవుతున్నప్పుడు అలో-30 మందును ప్రతి అరగంటకు ఒక డోసు చొప్పున వేస్తే వెంటనే విరేచనాలు ఆగిపోతాయి. ఒకవేళ అప్పటికీ విరేచనాలు ఆగ కపోతే డాక్టర్‌ను సంప్రదించవలసిందే!

కడుపునొప్పి
కొంత మంది పిల్లలకు హఠాత్తుగా కడుపు నొప్పి మొదలై విపరీతంగా ఏడుస్తుంటారు. నొప్పితో మెలికలు తిరుగుతుంటారు. ఈ సమస్య 90 శాతం మంది పిల్లల్లో నులిపురుగుల వల్లే వస్తుంది. ఈ పిల్లలకు సినా-30 మందును ప్రతి అరగంటకు ఒక డోసు చొప్పున ఓ నాలుగు డోసులు వస్తే కడుపు నొప్పి తగ్గిపోతుంది.

వడదెబ్బకు
కొందరు వడదెబ్బకు గురైనప్పుడు తీవ్రంగా జ్వరం వస్తుంది. కళ్లు బాగా ఎర్రబడతాయి. వీరికి బెల్లడోనా-200 మందును ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి చొప్పున తరుచూ ఆ రోజంతా వేస్తే వడదెబ్బ ప్రభావం తగ్గిపోతుంది.

కరెంట్ షాక్ కొడితే...
ఇంట్లో పిల్లలు ఫ్లగ్‌లో వేలు పెట్టడం లాంటివి చేసినప్పుడు కరెంట్ షాక్ తగిలితే వారికి పాస్ఫరస్-30 మందును ప్రతి పావుగంటకు లేదా అరగంటకు వేస్తే ఇబ్బంది తొలగిపోతుంది.

బహిష్టు నొప్పి
బహిష్టు సమయంలో కొంత మందికి విపరీతంగా నొప్పి వస్తూ ఉంటుంది. కొందరికి వాంతులు కూడా అవుతుంటాయి. వీరికి సిమిసిఫ్యూగా-30 మందును సమస్య తీవ్రతను అనుసరించి ప్రతి అరగంట లేదా గంటకు ఒక డోసు చొప్పున వేస్తూ ఉంటే తగ్గిపోతుంది.

కిడ్నీ నొప్పికి
కిడ్నీలోని రాయిని తొలగించడానికైతే అది డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవలసిందే కానీ, వెంటనే నొప్పి తగ్గడానికైతే కొన్ని మందులు వేసుకోవచ్చు. కుడివైపు కిడ్నీలో నొప్పి ఉంటే సర్సాఫరిల్లా-30 మందును ప్రతి అరగంటకు ఒక డోసు చొప్పున వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. ఎడమవైపు కిడ్నీలో నొప్పిగా ఉంటే బెరిబరిస్ వల్గారిస్-30 మందును ప్రతి అరగంట లేదా గంటకు ఒక డోసు చొప్పున వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది.

తలనొప్పికి...
సాధారణంగా వచ్చే తలనొప్పుల్లో ముఖ్యంగా నొప్పి హఠాత్తుగా మొదలై తీవ్రమైపోతే బెల్లడోనా-200 మందును నొప్పి తీవ్రతను బట్టి ప్రతి గంటకు లేదా రెండు గంటలకు ఒకడోసు చొప్పున వేసుకంటే నొప్పి తగ్గిపోతుంది.

పాముకాటుకు
ద్రోణా మదర్‌టించర్ ద్రావణం ఒకస్పూను, ఇకనీషియా మదర్‌టించర్ ద్రావణం ఒకస్పూను అరకప్పునీళ్లలో కలిపి ప్రతి పావుగంటకు ఒక స్పూను చొప్పున తాగిస్తే ఆ విష ప్రభావం తగ్గిపోతుంది.

పిల్లల ఏడుపు
ఒక్కోసారి పిల్లలు అర్థరాత్రి వేళ ఏడుపు లంఘిస్తారు. కారణమేమిటో ఏమీ అర్థం కాదు. ఇలాంటి స్థితిలో కెమోమిల్లా-30 మందును ప్రతి అరగంటకు ఒకడోసు చొప్పున ఇస్తే ఏడుపు మానేస్తారు. అలాగే ఒక్కోసారి చెవినొప్పి వస్తుంది. దీనికి కూడా ఇదే మందును ప్రతి అరగంటకు ఒకసారి చొప్పున వేస్తే తగ్గిపోతుంది.

No comments: