Tuesday, June 19, 2012

interesting



27 నక్షత్రములు , 12 రాశులు

ఆకాశం లో చాలా నక్షత్రాలు ఉన్నాయి కదా, వాటికి పేర్లు కూడా ఉన్నాయి. అయితే మనము 27 స్థిరంగా ఉండే నక్షత్రాలను మాత్రము మన ప్రాచీన జ్యోతిష /ఖగోళ శాస్త్రం లో అధ్యయనం చేస్తాము.


ఆకాశమును ఒక వర్తులా కార చక్రముగా ఊహించుకొని, దానిని 27 భాగాలుగా చేస్తే ప్రతి భాగాన్ని, ఆ భాగంలో ఉండే ఒక నక్షత్రం పేరుతొ పిలుస్త్తో ఉంటాము.



ఈ వర్తులాకారం, నక్షత్రాలుగా పిల్చుకొనే ఈ 27 భాగాలు స్థిరముగా ఉంటాయి. భూమి యొక్క కదిలికతో సంభంధం లేకుండా భూమి పైనుండి చూస్తె ఆకాశంలో వీటి స్థానాలు స్థిరం గా ఉంటాయి.


భూమి తిరగటం వల్ల కావచ్చు, ఇతర ఖగోళ పదార్ధాల కదలిక వల్ల కావచ్చు, 9 గ్రహాలు భూమి పై నుండి చూస్తే ఒకే ప్రదేశంలో (నక్షత్రాల వలె ) కనిపించవు. వాటి స్థానాలు ఆకాశం యొక్క ఈ 27 భాగాలలో ఎక్కడైనా ఉండచ్చు.


మనము ప్రతి నిమిషం లో ఏ గ్రహం ఆకాశం యొక్క ఏ భాగంలో (నక్షత్రంలో ) ఉన్నదో గనించలేము కదా. చంద్రుడు ఏ భాగం లో ఉంటే ఆ రోజు ఆ నక్షత్రం అంటాము. ఇదే మనకు తెలుగు కాలెండర్ లో కన్పించే నక్షత్రం.
ఒక శిశువు జన్మించి నప్పుడు, వివాహాది శుభ కార్యాల కోసం మంచి ముహూర్తం చూడటానికి మాత్రం చంద్రుని తో పాటు ఇతర గ్రహాలను కూడా పరిగణలోకి తీసుకొని ఏ గ్రహం ఏ నక్షత్రం లో ఉన్నదో లెక్క పెడతారు .
27 నక్షత్రాల పేర్లు ఇలా ఉన్నాయి
అశ్వని , భరణి , కృత్తిక,
రోహిణి, మృగశిర, ఆరుద్ర,
పునర్వసు,పుష్యమి, ఆశ్లేష,
మఖ, పుబ్బ (పూర్వ ఫల్గుని) , ఉత్తర (పల్గుని) ,
హస్త, చిత్త,స్వాతి,
విశాఖ, అనురాధ, జేష్ఠ,
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ ,
శ్రవణం, ధనిష్ఠ ,శతభిషం,
పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి.


ప్రతి నక్షత్రాన్ని నాలుగు భాగాలు చేస్తే ప్రతి భాగాన్ని ఒక పాదం అంటారు. కనుక జ్యోతిష చక్రం అనే ఈ వర్తులాకారం ఆకాశాన్ని 27 X 4 = 108 సమ భాగాలుగా విభజిస్తూ ఉన్నది.


ఇదే వర్తులాకారాన్ని 12 X 9 = 108 భాగాలు గా చేస్తే అవి 12 రాశులు అవుతాయి. ప్రతి రాశి లో తొమ్మిది సమభాగాలు ఉండాలి కదా అంటే తొమ్మిది నక్షత్ర పాదాలు కలిపి ఒక రాశి. ఈ రాశులకు పేర్లు ,గుర్తులు ఉంటాయి.
  1. మేషము (మేక)- అశ్వని (1,2,3,4) , భరణి (1,2,3,4), కృత్తిక (1)
  2. వృషభము (ఎద్దు) - కృత్తిక (2,3,4), రోహిణి (౧,౨,౩,౪) , మృగశిర (1,2)
  3. మిధునం (జంట) - మృగశిర (3,4) , ఆరుద్ర (1,2,3,4), పునర్వసు (1,2,3)
  4. కర్కాటకము (ఎండ్రకాయ) - పునర్వసు (4), పుష్యమి (1,2,3,4), ఆశ్లేష (1,2,3,4)
  5. సింహము - మఖ (1,2,3,4), పుబ్బ (1,2,3,4), ఉత్తర (1)
  6. కన్య - ఉత్తర (2,3,4), హస్త (1,2,3,4), చిత్త (1,2)
  7. తుల (త్రాసు) - చిత్త (3,4), స్వాతి (1,2,3,4), విశాఖ (1,2,3)
  8. చక్రంబట్టి (ఫలితాలను) - విశాఖ (4), అనురాధ (1,2,3,4) జేష్ట (1,2,3,4)
  9. ధనుస్సు (విల్లు) - మూల (1,2,3,4), పూర్వాషాఢ (1,2,3,4), ఉత్తరాషాఢ (1)
  10. మకరం (మొసలి) - ఉత్తరాషాఢ (2,3,4), శ్రవణం (1,2,3,4), ధనిష (1,2)
  11. కుంభం (కుండ) - ధనిష్ఠ (3,4), శతభిషం (1,2,3,4), పూర్వాభాద్ర (1,2,3,4)
  12. మీనం (చేప) - పూర్వాభాద్ర (4), ఉత్తరాభాద్ర (1,2,3,4) , రేవతి (1,2,3,4)
ఒక సమయంలో ఒక గ్రహం ఏ నక్షత్రం యొక్క ఏ పాదం లో ఉందొ తెలిస్తే , ఏ రాశిలో ఉన్నదో చెప్పవచ్చు. ఈ విషయాన్నే ఒక 12 పెట్టలున్న చతురస్ర లేక వృత్తాకారపు బొమ్మలో వ్రాస్తే దాన్నే రాశి చక్రం /జాతక చక్రం అంటారు.


జాతక చక్రం అంటే ఆ సమయంలో గ్రహాలు ఆకాశం లో ఎక్క ఎక్కడ ఉన్నాయో చెప్పటం మాత్రమె. ఇందులో మూఢ నమ్మకం ఏమి లేదు. పుట్టిన రోజు ని ఎలా ఇంగ్లీష్ కాలెండరు ప్రకారం, తెలుగు తిధుల ప్రకారం గుర్తు పెట్టుకొంతామో ఇది కూడా అలాగే ఆకాశం లో మనకు కనిపించే గ్రహాల స్థానాలను గుర్తించటం.


అయితే ఈ చక్రాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు , స్వభావ లక్షణాలు చెప్పటం మాత్రం ఒక probability ఆధారం గా జరిగిన సంఘటనలు బట్టి , జరగబోయ్యేవి ఊహించి చెప్తారు. దీనికి నిరూపణలు ఉండవు.

పంచ భక్ష్యములు

  1. భక్ష్య - కొరికి తినవలసినది - hard food , - గారెలు వంటివి
  2. భోజ్య - నమిలి తినగలిగినవి - soft food , - చిత్రాన్నము
  3. ఖాద్య - చప్పరించి మింగేవి - మైసూరు పాకు లాంటివి
  4. చోస్య - ద్రవ పదార్దాలు - preparations that are sucked, -
  5. లేహ్య - నాలుకతో నాకి తినేవి - food preparations, which could be licked. - సగ్గుబియ్యంపరమాన్నం

షడ్రుచులు

ఆరు రుచులు
  1. తీపి -sweet
  2. కారం - chili
  3. పులుపు -sour
  4. వగరు -tart
  5. ఉప్పు -salt
  6. చేదు - bitter

నవ గ్రహాలు

జ్యోతిష శాస్త్ర ప్రకారం తొమ్మిది గ్రహాలు ఉన్నవి. గ్రహం అంటే గ్రహించేది. శక్తిని గ్రహించే అన్నిటిని గ్రహాలుగా మన ప్రాచీన ఖగోళ శాస్త్రం చెప్తుంది. అవి,
  1. సూర్యుడు -భాను - ఆదిత్య -రవి
  2. చంద్రుడు - సోమ
  3. భూమి - భౌమ - మంగళ - కుజ
  4. బుధుడు - సౌమ్యుడు
  5. గురుడు - బృహస్పతి
  6. శుక్రుడు
  7. శని - మందుడు
  8. రాహువు
  9. కేతువు
వీటి లో రాహు కేతువులు కేవలం నీడలు కనుక వాటిని చాయా గ్రహాలని అంటారు

పంచ గవ్యాలు

మన ప్రాచీన వైద్య విధానం, ఆయుర్వేదం లో ఆవుకు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఆవు ద్వారా మనకు వచ్చే ఐదు వస్తువులను పంచ గవ్యాలు అంటారు. ఇవి ప్రకృతి వైద్యంలో వాడతారు. అవి,
  1. గోక్షీరము - ఆవు పాలు
  2. గోఘ్రుతము - ఆవు నెయ్యి
  3. గోదధి - ఆవు పెరుగు
  4. గోమూత్రము - ఆవు మూత్రము
  5. గోమయము - ఆవు పేడ

6 ఋతువులు, 12 మాసములు

తెలుగు వారు చంద్ర గమనాన్ని అనుసరించి మాసాలు లెక్కిస్తారు. అమావాస్య తర్వాతి రోజు (పాడ్యమి) నుండి అమావాస్య దాకా ఒక మాసం.


ఇలా 12 మాసములు ఒక సంవత్సరం గా లెక్క పెడతారు. అయితే సంవత్సరం అంటే సూర్యుని గమనాన్ని బట్టి లెక్కించాలి కనుక కొన్ని సంవత్సరాలలో 12 బదులుగా 13 నెలలు లెక్కిస్తారు. (ఇంగ్లీష్ కాలెండరు లో లీప్ ఇయర్ లా ). అలాంటి సంవత్సరాలలో ఏదో ఒక మాసాన్ని రెండు సార్లు లెక్క వేస్తారు. ఇలా వచ్చే మాసాన్ని అధిక మాసం అంటారు. ఈవిధం గా చాంద్రమానం తో సౌర మానాన్ని కలిపి తెలుగు క్యాలెండర్ రూపొందుతుంది.


రెండు నెలలు (మాసాలు) కలిపి ఒక ఋతువు. ఈ ఋతువుల ప్రాముఖ్యత ఏమిటంటే, ప్రతి ఋతువులో ప్రకృతి వివిధ రూపాలలో మనకు కనిపిస్తుంది. (ఈ ఋతువులకు ఆంధ్ర దేశాన్ని అనుసరించి పేరు పెట్టారు. భూమి పై ఇతర ప్రాంతాలలో ఇలాగే ఉండాలని లేదు)
  1. చైత్ర, వైశాఖ మాసములు వసంతఋతువు - చెట్లు చిగురిస్తాయి
  2. జేష్ఠ , ఆషాడ మాసములు గ్రీష్మఋతువు - ఎండలు కాస్తాయి
  3. శ్రావణ, భాద్రపద మాసములు వర్షఋతువు - వానలు కురుస్తాయి
  4. ఆశ్వయుజ, కార్తిక మాసములు శరత్ఋతువు - చక్కటి వెన్నెల కాస్తుంది
  5. మార్గశిర, పుష్య మాసములు హేమంతఋతువు- రాత్రులు మంచు కురుస్తుంది
  6. మాఘ, ఫాల్గుణ మాసములు శ శిర ఋతువు - ఆకులు రాలు కాలము

వేదాంగాలు

నాలుగు వేదాలకు తోడుగా మనకు ఆరు వేదాంగాలు ఉన్నవి.
  1. శిక్ష - సంధి - phonetics and phonology
  2. ఛందస్సు - meter, The rhythm in poetry and music. -
  3. వ్యాకరణము - grammar
  4. నిరుక్త - etymology - భాష పుట్టు పూర్వోత్తరాలు
  5. జ్యోతిష - astrology and astronomy - ఖగోళ , అంతరిక్ష శాస్త్రము
  6. కల్పము - rituals - ఆచార వ్యవహారాలు

చతుర్వేదములు

నాలుగు వేదాలు సనాతన భారతీయ సంస్కృతికి ఆధారాలు. అవి,
  1. ఋగ్వేదము
  2. యజుర్వేదము
  3. సామ వేదము
  4. అధర్వణ వేదము

పంచ కన్యలు

  1. తార
  2. అహల్య
  3. మండోదరి
  4. కుంతి
  5. ద్రౌపది

పంచ కావ్యాలు


త్రిగుణములు

సత్వ - balance or equilibrium -fineness, lightness, illumination and joy
రజో - expansion or activity -activity, excitation and pain
తమో - inertia or resistance to action -coarseness, heavyness, obstruction and sloth.
గుణములను త్రిగుణములు అంటారు.

కర్మేంద్రియములు

  1. నోరు
  2. చేతులు
  3. కాళ్ళు
  4. మూత్ర,
  5. మల ద్వారాలు

జ్ఞానేంద్రియాలు

  1. కన్నులు - చూపు, ద్రుష్టి
  2. ముక్కు - వాసన , ఆగ్రాణం
  3. చెవులు -వినికిడి , శ్రవణం
  4. నాలుక - రుచి , రసన
  5. చర్మము - స్పర్శ




పంచ భూతాలు

జీవులకు ఐదు ప్రాధమిక ఆధారాలు ..


  1. ఆకాశం
  2. వాయువు
  3. అగ్ని
  4. నీరు
  5. భూమి
మనిషి లో ఐదు ప్రాణాలు ఉంటాయని ఈ ఐదు ప్రాణాలు పంచ భూతాల్లో కలిసి పోతాయని అంటారు.
పంచ భూతాలను సూచిస్తూ ఐదు ప్రసిద్ధ శివ క్షేత్రాలు ఉన్నాయి.
  1. ఆకాశం - చిదంబరం - శివుడు నిరాకారం గా ఉంటాడు
  2. వాయువు - శ్రీకాళ హస్తి - శివలింగం నుండి గాలి వస్తూ ఉంటుంది
  3. అగ్ని -అరుణాచలం - స్వామి దగ్గర వెలుగు ఉత్పత్తి అవుతూ ఉంటుంది.
  4. నీరు -జంబుకేశ్వరం - శివ లింగం నుండి నీరు వస్తూ ఉంటుంది
  5. భూమి - ఏకాంబరేశ్వర , కంచి 

నవధాన్యాలు

  1. వరి -paddy - चावल
  2. ఉలవలు - horse gram - गहत , कुलथ
  3. పెసలు - green gram - मूंग दाल
  4. మినుములు - black gram - उर्द दाल
  5. నువ్వులు - sesame - तिल
  6. గోధుమలు - wheet - गेहू
  7. అనుములు -cowpea - चवली 
  8. కందులు - pigeon pea , red gram - तूर दाल, तूवार
  9. శనగలు - chickpea , bengal gram, indian pea - चना दाल , छोले

అష్టదిక్కులు- దిక్పాలకులు

మనకు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా
  1. తూర్పు- సూర్యుడు ఉదయించే దిక్కు,
  2. పడమర - సూర్యుడు అస్తమించే దిక్కు,
  3. దక్షిణం - సూర్యునివైపు తిరిగి నించుంటే కుడి ,
  4. ఉత్తరం -సూర్యుని వైపు నుంచుంటే ఎడమ .
అలాగే నాలుగు మూలలు. ఆ నై వా ఈ అనేది కొండ గుర్తు. ఆనై అంటే తమిళం లో ఏనుగు, వాయి అంటే నోరు. ఆనైవాయి అంటే ఏనుగు నోరు అన్నమాట. అలా మనం మూలలు వరసలో గుర్తుపెట్టుకో వచ్చు. తూర్పు నుండి లెక్కిస్తే
  1. ఆగ్నేయం ,
  2. నైరుతి,
  3. వాయువ్యం,
  4. ఈశాన్యం
ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు అధికారులు. వాళ్ల వివరాలు ...
  • దిక్కు - దేవత - భార్య - పట్టణం - ఆయుధం - వాహనం
  1. తూర్పు - ఇంద్రుడు - శచి - అమరావతి - వజ్రాయుధం - ఐరావతం
  2. ఆగ్నేయం - అగ్నిదేవుడు - స్వాహా - తేజోవతి - శక్తి - తగరు
  3. దక్షిణం - యముడు - శ్యామల- సంయమని - పాశం - దున్నపోతు
  4. నైరుతి - ని ర్రు తి - దీర్ఘా దేవి- కృష్ణ గమని - కుంతం - నరుడు
  5. పశ్చిమం - వరుణుడు - కాళిక- శ్రద్ధావతి - దండం - మొసలి
  6. వాయువ్యం - వాయువు -అంజన - గంధవతి - ద్వజం - - జింక
  7. ఉత్తరం - కుబేరుడు - చిత్ర రేఖి - అలకాపురి - కత్తి- అశ్వం
  8. ఈశాన్యం - ఈశానుడు - పార్వతి - కైలాసం - త్రిశూలం - నంది

త్రిమూర్తులు

బ్రహ్మా విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులు అంటారు.
పరమాత్మ స్వరూపం ఒకటే అయినా అది మూడు రూపాలలో ఈ ప్రపంచాన్ని నడి పిస్తుంది.


  1. బ్రహ్మా రూపంలో సృష్టి
  2. విష్ణు రూపంలో పాలన (స్థితి)
  3. రుద్రుని గా లయ చెయ్య బడుతుంది
మరి వీరితో సహచర్యం చేస్తూ సమస్త లోకాలను అమ్మల వలె కాపాడే ముగ్గురు అమ్మలు ,
  1. బ్రహ్మ నాలుక పై సంచరించే సరస్వతి
  2. విషు మూర్తి వక్ష స్తలంలో ఉండే లక్ష్మి
  3. ఈశ్వరుని అర్ధ భాగము అయిన పార్వతి





త్రికరణములు

మనసు, వాక్కు, శరీరం
ఈ మూడింటికి సమన్వయము కుదిరి చేసిన పనే సంపూర్ణం గా ఉంటుంది. మనో వాక్కాయక కర్మలు అంటే అవే.
మనసు ఒకటి చెప్తే వాక్కు ఒకరకం గా సూచిస్తుంటే శరీరం ఇంకో రకం గా పని చేస్తే అది వన్నెకెక్కదు. అటువంటి పని చెయ్యటం కంటే మానటం మంచిది

నవ విధ భక్తి

భగవతుణ్ణి భక్తి మార్గం లో ఆరాధించ టానికి తొమ్మిది రకాలైన విధానాలు ఉన్నాయి. వీటిల్లో అన్నీ లేక కొన్ని పాటించి భగవంతుని అనుగ్రహం పొందవచ్చు.
  1. శ్రవణం - దేవుని గురించి వినుట
  2. కీర్తనం - అన్నమయ్య వలె , త్యాగయ్య వలె దేవుని కీర్తి పాడుట
  3. దైవ స్మరణ - నారదుని వలె నిరంతరం నామం స్మరించుట
  4. పాద సేవ - గరుడుని వలె స్వామి సేవ చేయటం
  5. అర్చన - ఆవాహనము , ఆసనం, అర్ఘ్యం, పాద్యము , స్నానము, వస్త్రము, అలంకారం, పూజ, ధూపం,దీపం, నైవేద్యము, నీరాజనం వంటి పద హారు చర్యలతో అర్చించటం.
  6. వందనం- త్రికరణ (మనసు, వాక్కు , శరీరం) సుద్ది గా నమస్కరించటం .
  7. దాస్యం - హనుమంతుని వలె దాస్యం చేయటం
  8. సఖ్యం - గోపికల వలె అర్జునిని వలె దేవుని తమ సఖుని గా భావించి తనపై భారం వేయటం.
  9. ఆత్మ నివేదనం - ఆత్మ (తనను తాను) భగవంతుని కి అర్పించి స్వామి సంకల్పం పై కర్మలు చేయటం

పంచారామాలు

సుబ్రహ్మణ్య స్వామి తారకాసురున్ని వధించినప్పుడు ఆయన మెడ లోని శివ లింగం ఐదు ప్రదేశాలలో పడింది. ఆ ఐదు పంచారామాలు గా ప్రసిద్ది గాంచాయి.


  1. అమరారామం - అమరావతి - గుంటూరు దగ్గర ( ఇది ప్రసిద్ది చెందిన బౌద్ద ఆరామాలలో ఒకటి కూడా )
  2. ద్రాక్షారామం - తూ గో జిల్లా రామచంద్రా పురం దగ్గర (ఇది అష్టా దశ శక్తి పీఠాల లో ఒకటి కూడా , మాణిక్యాంబ)
  3. కుమారారామం - సామర్ల కోట- తూ గో జిల్లా
  4. భీమా రామం - భీమవరం - ప గో జిల్లా
  5. క్షీరారామం - పాలకొల్లు - ప గో జిల్లా నరసాపురం దగ్గర

No comments: