Tuesday, April 12, 2011

ayurveda tips

వాము(ఓమ) తో ఆయుర్వేదం


అవయవాలు షాక్ కొట్టినట్లు అదురుతూ వుంటే
వాము ,మిరియాలు , గసగసాలు ఈ మూడు సమబాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి దంచి జల్లెడ పట్టి వస్త్ర గాలితం చేసి , ఆ పొడికి తగినంత నువ్వుల నూనె కలిపి మెత్తి పేస్టు లాగా రుబ్బి , ఆ పేస్టు ను వళ్ళంతా రుద్దుకుంటే అవయవాలు అదిరే రోగము తగ్గుతుంది.


వళ్ళంతా తిమ్మిర్లా?
వాము 100gm , తీసుకుని నీటితో మెత్తగా నూరి అందులో 50 gm , ఆవు నెయ్యి కలిపి చిన్న మంట మీద నెయ్యి మాడి పోకుండా వండి దించి దానిని గోరువేచగా తిమ్మిర్ల మీద వళ్ళంతా మర్దనా చేసుకుంటూ , అదే నేతి ని పూటకు ఉసిరికాయంత తింటూ వుంటే తిమ్మిరి తగ్గి పోతుంది .
ముక్కు సమస్య
వాము 10gm , పాత బెల్లం 40 gm , తీసుకుని 2 కలిపి దంచి ఆ ముద్దను అర లిటరే నీటిలో వేసి , పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద నిదానంగా పావు లీటర్ కషాయం మిగిలే వరకు మరిగించి దించి , వడపోసి ఉదయం పూట తాగాలి , అలాగే సాయంత్రం కూడా తాగాలి.ఇలా 2 లేక 3 రోజులు తాగేటప్పటికి జలుబు , పడిశము , శ్వాససరిగా లేక పోవటం , సైనసైటీస్ మొదలైన ముక్కుకు సంబంధించిన సమస్యలు తీరతమే కాక ఉదరం లోని గ్యాస్ తోలిగిమ్పబడి , అగ్ని దీప్తి కలిగి , జీర్ణ శక్తి పెరిగి , తిన్న ఆహారం బాగా వంటబట్టి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది.
చెవుడు
వాము 50 gm తీసుకుని శుబ్రం చేసి ఆ వామును పావు లీటర్ నీటితో కలిపి దంచి రసం తీసి , ఆరసం లో నువ్వుల నూనె 100gm , కలిపి చిన్న మంట మీద నీరు ఇగిరి పోయి , నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి వడపోసి , ఆ నూనె నిలువ ఉంచుకుని , రోజు 2 పూటల పూటకు 4,5 చుక్కలు చెవిలో వేస్తూ వుంటే క్రమంగా చెవుడు తగ్గుతుంది.
చెవిలో పోటు
వాము 2 చిటికెలు , తమలపాకులు 2 కలిపి దంచి రసం తీసి వడపోసి 4 చుక్కలు 2 పూటలా చెవిలో వేస్తూ వుంటే చెవుడు తగ్గుతుంది.
కళ్ళు దురదలు
వాము చెట్టును సమోలంగా తేచి కడిగి ఎండ బెట్టి కాల్చి బూడిద చేయాలి . ఆ బూడిదను నీటిలో కలిపి 3 రోజులు నిలువ ఉంచాలి . తరువాత పాత్రలో తేరుకున్న తేటను వంచుకుని వడపోసి నిలువ వుంచుకోవాలి. దీనిని కళ్ళు దురధలుగా వున్నప్పుడు 2 చుక్కలు కంట్లో వేసుకుంటే దురదలు తగిపోతై.
కనురెప్పల వెంట్రుకలు ఊడుట
వాము 3gm తీసుకుని ఇసుక లేకుండా శుబ్రంగా చెరిగి రోటిలో వేసి అందులో నాటు కోడి గుడ్డు లోని తెల్ల సోన వేసి బాగా మెతగా కాటుగా లాగా మర్దించి నిలువ ఉంచుకుని , కంటి రెప్పలకు పెడుతూ వుంటే క్రమంగా రెప్పల మీద వెంట్రుకలు ఊడటం తగ్గటమే కాక , రెప్పల వాపు , రెప్పల లోపల పెరిగే దుర్మమ్సం కూడా హరించి రెప్పల మీద ఊడిపోయిన వెంట్రుకలు మల్లి మోలుస్తై.
ఒళ్ళు దురద
వాము 20gm , పసుపు 10gm , పొంగించిన వెలిగారము 10gm ఈ 3 కలిపి మంచి నీటితో మెత్తగా దంచి దురధలున్న చోట మర్దన చేస్తూ వుంటే అయిదారు రోజుల్లో ఎంత మొండి బండ దురధలైన హరించి పోతై. వంటికి లేపనం చేసిన చేసిన తరువాత 2 గంటలు ఆగి వేడి నీటితో స్నానం చేయాలి. వేడి చేసే పదార్ధాలు , వంకాయ , గోంగూర , గుమ్మడి కాయ , గోంగూర ,ఆవకాయ , కోడి మాంసం కోడి గుడ్డు పనికి రావు.
చెవిలో చీము
వాము 10gm , పసుపు 10gm , ముల్లంగి దుంపల రసము 75gm , నువ్వుల నూనె 250gm .తీసుకుని వీటిని ఇనుప మూకుడు లేదా ఇనుప బాండి లో వేసి చిన్న మంట మీద నూనె మిగిలే వరకు మరిగించి వడపోసి , నిలువ వుంచుకోవాలి .రోజు 2 పూటలా 2 లేక 3 చుక్కలు చెవుల్లో వేస్తూ వుంటే ఏ కారణం వల్ల కలిగిన చెవిలో చీము అయినా తగ్గిపోయి చెవులు ఆరోగ్యవంతంగా మారతాయి.
కాళ్ళల్లో - చేతుల్లో చెమటా ?
వామును శుబ్రం చేసి ,కొంచెం దోరగా వేయించి దంచి ఆ పొడిని తగినంత మంచి నువ్వుల నూనె లో వేసి నానబెట్టి రోజు పరగడపున 5gm మోతాదుగా తింటూ వుంటే అరచేతుల్లోనూ ,అరికల్లోను వచ్చే చెమట తగ్గిపోతుంది.








వాము(ఓమ) తో ఆయుర్వేదం


చర్మంపై దద్దుర్లు
వాము ,పాత బెల్లం సమబాగాలుగా దంచి ఉసిరిక కాయంత(10gm) ఉండలుగా చేసి నిలువ ఉంచుకుని పూటకు ఒక ముద్ద చొప్పున 2 పూటలా తింటూ వుంటే చర్మం పై దద్దుర్లు తగ్గి పోతాయి.
నీళ్ళ విరేచనములు
వాము అరకు అంటే వాము వాటర్ పూటకు ఒక ఔన్సు చొప్పున 2 లేక 3 పూటలా సేవిస్తూ వుంటే వెంటనే నీళ్ళ విరేచనాలు కట్టుకున్తై.విరేచనాలు ఎక్కువగా వుంటే 2 ఔన్సులు పేద వాళ్లకు ఇవ్వవచ్చు.
కడుపు నొప్పులకు
వాము వాటర్ ఒకటి లేదా 2 ఔన్సులు మోతాదుగా అవసరాన్ని బట్టి తాగితే వెంటనే కడుపు నొప్పి ,ఉబ్బరం తగ్గిపోతాయి.
కడుపులో మేలితిప్పుతూ ఉంటె
వాము , ఉప్పు సమానంగా తీసుకుని కొంచెం నీటిలో కలిపి మేతగా నూరి కుంకుడు గింజలంత టాబ్లెట్ చేసి గాలి తగిలేటట్లు ఆరబెట్టుకుని ,పూటకు ఒక టాబ్లెట్ చొప్పున వేడి నీటితో వేసుకుంటూ వుంటే అజీర్ణం ,గ్యాస్ అసిడిటీ వల్ల ,కడుపులో మెలితిప్పినట్లుగా వుండే ఉదర శూల తగ్గి పోతుంది.
ఆకలి పెరుగుటకు
వాము 10gm ,నల్ల ఉప్పు 3gm , పొంగించిన ఇంగువ 1gm కలిపి దంచి చూర్ణం చేసి నిలువ వుంచుకోవాలి.ఆకలి సరిగా లేనప్పుడు ఈ చూర్ణాన్ని 2 చిటికెల మోతాదుగా గోరువేచని 2 పూటలా సేవిస్తూ వుంటే కడుపు వికారము , కడుపు శూల ,అజీర్ణము ఇవన్ని హరించి బాగా ఆకలి పుడుతుంది.
జలుబు-పడిశము
వాము 10gm ,బెల్లము 40 gm కలిపి దంచి ఆ ముద్దను అర లీటర్ నీటిలో కలిపి పొయ్యి మీద పెట్టి పావు లిటరే కషాయం మిగిలే వరకు మరిగించి వాడపోసుకుని అది గోరువెచగా అయిన తరువాత తాగాలి.వేడి శరీరం వున్నా వారు ఈ కషాయం చల్లార్చిన తరువాత చల్లగా తాగాలి .తాగిన వెంటనే దుప్పటి కప్పుకుని పడుకోవాలి .ఈ విధంగా 2,3 రోజు లు చేస్తే ఎంత తీవ్రమైన జలుబు ,పడిశ బారమైన తగ్గిపోతాయి.
కఫా జ్వరములకు
శరీరంలో కఫము పెరిగి జలుబు , జలుబు పడిశము తో కూడిన కఫా జ్వరము కలిగినపుడు వాము 10gm తీసుకుని చిన్న మట్టి పిడతలో వేసి అందులో 2 గ్లాస్ నీటిని పోసి మూత పెట్టి రాత్రి నుండి ఉదయం వరకు అలాగే వుంచి ఉదయం పూట వడగట్టి అందులో చిటికెడు ఉప్పు కలిపి ఆ నీటిని తాగాలి . ఇలా 2,3 రోజులు చేస్తే కఫాజ్వరము తగ్గుతుంది.
విషమ జ్వరాలకు
వాము పొడి 6gm , పాత బెల్లం 20gm , కలిపి పూటకొక మోతాదుగా దంచి 2 పూటలా తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గి పోతాయి .
డస్ట్ ఎలర్జీ
వాము మెత్తగా దంచి పలుచని గుడ్డలో మూట గట్టి దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుని మాటిమాటికి వాసన చూస్తూ వుంటే దుమ్ము వల్ల ,తాలింపు వల్ల ,గాటు వాసన వల్ల కలిగే ఎలేర్జి రాకుండా వుంటుంది.
పిల్లల సకల వ్యాధులు
వాము ,మిరియాలు ,శొంటి ,కుక్క పొగాకు ఈ 4 ఒక్కొక్కటి 10gm ,నల్ల ఉప్పు 20gm తీసుకోవాలి .వాము మిరియాలు ,శొంటి ఈ మూటిని దోరగా వేయించి అన్ని కలిపి దంచి పెట్టుకోవాలి .ఆ పొడిలో తగినంత కుక్క పొగాకు ఆకు రసము కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి.తరువాత సైంధవ లవణం 3 చిటికెలు , వాము 3 చిటికెలు ఒక గ్లాస్ నీటిలో వేసి సగం గ్లాస్ కషాయం మిగిలేల మరిగించి వడపోసి చల్లార్చి ఈ కషాయాన్ని 2 బాగాలు చేసి , పై మాత్రను సగం కషాయం తో ఉదయం ,సగం కషాయం తో సాయంత్రం వేసుకుంటూ వుంటే శిశువుల సమస్య తగ్గి పోతుంది.
మలేరియా జ్వరమునకు
వాము 5gm ,మిరియాలు లెక్కకు 12 ,శొంటి 5 gm.ఈ మూడింటిని ఒక మట్టి పిడతలో వేసి అందులో ఒక గ్లాస్ మంచి నీటిని పోసి రాత్రి నుండి ఉదయం వరకు వరకు నిలవ వుంచి ఉదయం పూట గుడ్డ లో వడపోసి ఆ నీళ్ళు పారబోసి ,పిడత లోని పదార్ధాలను తీసుకుని , అందులో 12 తులసి ఆకులు , 3 చిటికెల నల్ల ఉప్పు కలిపి నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఎండి పోయేలా ఆరబెట్టి నిలవ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 3 పూతల మంచి నీటితో వేసుకుంటూ వుంటే మలేరియా జ్వరం హరించి పోతుంది.






తులసి వైద్యం


[1].నోటి దుర్వాసన పోవటానికి తులసి ఆకులు ,మిరియాలు కలిపి రోజు నిత్యము నమిలి మింగాలి.

[2].నిత్యము 5,6 తులసి ఆకులు నమిలి మింగు చుండిన రక్తపు పోటు శాంతిస్తుంది.

[3].చెవి పోటు నందు 2,3 చుక్కలు తులసి ఆకు రసము వేయాలి .

[4].మలేరియా మరియు ఇతర జ్వరాలతో తులసి యాకు రసం 1 స్పూన్ ఉదయం సాయంత్రం సేవించాలి.

[5].తులసి కాషాయ సేవనంతో జలుబు ,రొంప ,శిరశూల ,జ్వరాలు తగ్గి పోతాయి.

[6].తులసి ఆకు రసం లో తేనె కలిపి సేవించిన తల తిరగటం ,బరమ ,పిత్త వికారాలు తొలగుతాయి .

[7].తులసి వేరును అరగదీసి ఆ గంధాన్ని తేలు కాటు ,తేనె తీగలు ఇతర క్రిములు కరచిన చోట లేపనం చేస్తే ఉపశమనం కలుగుతుంది.

[8].తులసి యాకులు ,తాగే నీటిలో లేదా తేనీటిలో రోజు వేసుకుని సేవించిన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

[9].పసి పిల్లలకు వచ్చు కడుపుబ్బరం లో తులసి రసం ,తమలపాకు రసం సమానం తీసుకుని 10 చుక్కల చొప్పున రోజుకు 3,4 సార్లు పట్టాలి.

[10].పెద్ధలకేర్పాడు ఉదర వ్యాదులలో (కడుపు ఉబ్బరం) తులసి రసం అల్లపు రసం సమానం తీసుకుని 1 స్పూన్ మోతాదు ప్రతి 2 గంటలకు ఒకసారి సేవించాలి.

[11].శరీరము పై ఏర్పడు నల్లని మచ్చలకు తులసి ఆకు రసం పొంగించిన వేలిగారం తో కలిపి ముకానికి లేపనం చేయాలి.

[12].తల పై వచ్చు చుండ్రు కు ,తులసి యాకు రసాన్ని రుద్ది ఆ తరువాత వేప నూనె మసాజ్ చేస్తే తగ్గిపోతుంది.

[13].శరీరము పై ఏర్పడు దురద ,చర్మ వ్యాధులకు తులసి రసాన్ని పై లేపనానికి 1 స్పూన్ రోజు కు 2 సార్లు లోపలికి సేవించాలి.

[14].కాన్సర్ వ్యాధి రోగికి కూడా తులసి యాకులు ప్రతి నిత్యం రోజు తినిపిస్తే ఉపశమనం కలగటమే కాక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

[15].తులసి గింజల కషాయాన్ని అర్శమొలల వ్యాధి కల వారికి నిత్యం తాగించాలి.

[16].తల పై పేలు గల వారికి ,రాత్రి పడుకునే ముందు తులసి యాకు రసం తలపై అంటించాలి.

[17].తులసి యాకులు ,వేరు ఎండించి చూర్ణము చేసి ముక్కు పొడిగా ఉపయోగించిన ముక్కు సంబంధ వ్యాధులు తగ్గి పోతాయి.

[18].శరీరము పై ఏర్పడు దద్దుర్ల తో (ఎలర్జీ) తులసి రసాన్ని అంటించిన ఉపశమనం కలుగుతుంది.

[19].అన్ని రకములైన చర్మ వ్యాదులలో తులసి రసము ,నిమ్మ రసము సమానం కలిపి చర్మము పై లేపనం చేయవలె





తేనె తో ఆయుర్వేదం


స్త్రీల ఎర్రబట్టకు
తేనె 20gm ,ఉసిరికాయ బెరడు చూర్ణము 10gm .ఈ రెండు కలిపి ఒక మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే స్త్రీల ఎర్రబట్ట వ్యాధి ఎగిరిపోతుంది.
నేత్ర బలం
రాత్రి నిద్ర పోయే ముందు తేనె నీరుల్లి (ఒనిఒన్) రసం సమంగా కలిపి 2 చుక్కలు కంట్లో వేసుకొంటూ వుంటే నేత్ర దోషాలు నివారిమ్పబడి కండ్లకు అదిక బలము , దృష్టి పెరుగుతాయి.
అంటు వ్యాధులకు
తేనె మైనమును నిప్పుల మీద వేసి ఆ పొగను ఇంట్లో ప్రసరింపచేస్తూ వుంటే అంటూ వ్యాధులు సోకకుండా నివారిమ్పబదతై.అందుకే ప్రతి రోజు చేసే యజ్ఞం లో తేనె వాడాలని మన శాస్త్రాలు నిర్దారించై .
జలుబు-పడిశము
రోజు 2 లేక 3 పూటలా అవసరాన్ని బట్టి 30gm తేనె 25gm అల్లం రసం కలిపి తాగుతూ వుంటే జలుబు ,పడిశము 2 రోజుల్లోనే హరించి పోతాయి.జీర్ణశక్తి పెరుగుతుంది.మలబద్ధకం కూడా నివారింపబడుతుంది .
శరీర స్థౌల్యము తగ్గుటకు
ప్రతి రోజు ఉదయం పరగడపున 20gm తేనె ను రాత్రినిలువ వున్నా నీటిలో కలిపి తాగుతూ వుంటే క్రమంగా శేరీర స్థౌల్యము తగ్గిపోతుంది.
బిళ్లలకు-గడ్దలకు
తేనె ,సున్నము ఈ రెండు సమంగా కలిపి నూరి శరీరం మీద లేచే బిళ్లలకు గాని ,గడ్దలకు గాని పట్టు లాగ వేసి పైన పలుచటి నూలుగుడ్డ అంటిస్తూ వుంటే అవి కరిగిపోతాయి.
వంతులకు
తేనె 20gm ,దోరగా వేయించి దంచిన జీలకర్ర చూర్ణము 3gm కలిపి ఒక మోతాదుగా రోజుకు 3 లేక 4 లేక 5 సార్లు వ్యాధి తీవ్రతను బట్టి వాడుతూ వుంటే వాంతులు తగ్గిపోతాయి.
కంటి మసకలకు
[1].ఎండు కర్జూరము కాయ లోపలి గింజను మంచి తేనె తో సానరాయి మీద అరగదీసి ఆ గంధాన్ని పెసర బాధంత కంట్లో పెట్టుకొంటూ వుంటే కంటి మసకలు నివారింపబడతాయి .
[2].మంచి మేలు రకమైన పట్టు తేనె 4 చెంచాలు ,మంచి మేలు రకమైన పచ్చ కర్పూరము 2 చిన్న పలుకులు కలిపి మేతగా నూరి గాజు బరిణి లో నిలువ ఉంచుకుని ,రాత్రి పూట కండ్ల లో పెసర బద్ధంత పెట్టుకొంటూ వుంటే ,కండ్ల లో కొంచెం నీరు కారి పోయి ,కండ్లు తేటగా చల్లగా మారి ,మసకలు కంటి దురదలు కూడా తగ్గిపోతాయి.
కాళ్ళ పగుళ్ళకు
తేనె మైనం 50gm ,తీసుకుని చిన్న మంట మీద మరిగించి వడపోసి అందులో 100gm వెన్నపూస కలిపితే అది కూడా కరిగిపోయి ,ఆ తరువాత ఆ రెండు దార్ధాలు పేస్ట్ లాగ మారతాయి. ఆ పదార్ధాన్ని పాదాల పగుళ్ళకు లేపనం చేస్తూ వుంటే పగుళ్ళు తగ్గిపోయి పాదాలు నున్నగా అవుతాయి.
కంట్లో పువ్వులకు
తేనె ,లేత మునగాకు రసం సమబాగంగా కలిపి రోజు రాత్రి నిద్ర పోయే ముందు 2 చుక్కలు కంట్లో వేస్తూ వుంటే కంటి లోని పువ్వులు కరిగి పోతాయి.
నీరసం రోగం
రోజు 2 పూతల అర గ్లాస్ మంచి నీళ్ళల్లో 30gm ,తేనె కలిపి తాగుతూ వుంటే నీరసం రోగం తగ్గిపోయి వంటికి మంచి బలం.
మూత్రం కష్టంగా వస్తుంటే
తేనె 150gm ,మంచి మేలు జాతి పసుపు 50gm ,కలిపి బాగా మెత్తగా నూరి నిలువ ఉంచుకుని రోజు 2 పూతల పూటకు 15gm ,మోతాదుగా సేవించి వెంటనే ఆవు పాలు తాగుతూ వుంటే మూత్రం బొట్టుబొట్టులా పడటం హరించి సాఫీగా వెలువడుతుంది.
దగ్గులకు
తేనె 3gm ,అల్లం రసం 6gm కలిపి ఒక మోతాదుగా ,2 పూటలా సేవిస్తూ వుంటే దగ్గు తగ్గిపోతుంది.
పిల్లల ఉదర పోటుకు
ప్రతి రోజు ఉదయం పరగడపున పావు గ్లాస్ నీళ్ళల్లో పావు చెంచా తేనె కలిపి తాగిస్తూ వుంటే పిల్లల గాలి పొట్ట కరిగిపోతుంది.
పిల్లల చిగుళ్ళ వాపులకు
పిల్లలకు దంతాలు వచ్చే ముందు చిగుళ్ళు వాస్తే నిప్పుల మీద పొంగించిన వెలిగారము ,తేనె కలిపి మెత్తగా నూరి కొద్ది పరిమాణము చిగుళ్ళ మీద పట్టిస్తూ వుంటే ఆ వాపులు తగ్గిపోతాయి.
నోటి దుర్గంధం
పావు లీటర్ మంచి నీళ్ళల్లో 10gm తేనె కలిపి ,ఆ నీటిలో రోజు 3 పూటలా పుక్కిలించి వూసివేస్తూ వుంటే నోటి దుర్గంధం హరించి పోయి ,నోరు పరిమలంగా వుంటుంది.




స్పొండిలిటీస్ వ్యాధి


పెరుగుతున్న జనాబా ధాటికి దీటుగా ఉన్నామంటూ రోగాలు మానవాళిని వెంటాడుతున్న నేటి రోజులలో ,యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ వారిని పట్టిపీడిస్తున్న వ్యాదులలో SARVAIKIL SPONDDILAITIES ఒకటిగా చెప్పవచ్చు .ఈ వ్యాధిని బారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదం లో మన్యాస్తంబం (వాత వ్యాదులలో ఒకటి) గా వివరించారు.


వ్యాధి లక్షణాలు
మెడ వెనుక బాగంలో నొప్పి వెనక కండరాలు బిగిసినట్లు ఉండటము ,బుజాలు మోచేతులు బాగం లో ఉన్న కీల్లల్లో నొప్పి కొన్ని సందర్బాలలో తల నొప్పి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా వివరించవచ్చు .


వ్యాధి కారణాలు
ఎక్కువగా మెడ పైకేతి చూడటం ,ప్రమాదవశాతు తలకు తగిలే గాయాలు ,ఎక్కువ చేదైన ఆహారపదార్ధాలు తినడం ,పగటి యందు నిద్రించుట ,ఎత్తు పల్లాలలో నిద్రించుట ,సక్రమంగా కూర్చొనక పోవడం ,తలక్రింద ఎతైన దిండు ,వస్తువుల వంటివి పెట్టుకుని నిద్రించుట ,కళ్ళు మిక్కుటంగా తెరచి చూచుట వలన ప్రకోపం చెందిన వాతం కఫం తో చేరి తల వెనుక నున్న మన్యలను 14 సిరలను స్తంబింప చేసి ఈ వ్యాధులను కలుగ చేయును .అంతే కాక వెన్ను పూస మరియు 2 వెన్నుల మధ్యనున్న మృదులాస్థి క్షీణించడం వలన ఈ వ్యాధి కలుగును .ఈ వ్యాధి చికిత్సకు ఉపెక్షించినచో కొన్ని సందర్బాలలో పక్షవాతం కూడా రావచ్చు .తొలి దశలోనే గుర్తించి తగు చికిత్సలు చేసినచో ఈ వ్యాధిని సులబంగా నివారించవచ్చు .

ఆయుర్వేద చికిత్సలు
నారాయణ తైలం గోరువెచ్చగా చేసి మెడ బాగం లో మృదువుగా మర్దనా చేయాలి.
సింహనార గగ్గులు గాని ,యోగరాజు గగ్గులు గాని పూటకు ఒక బిళ్ళ చొప్పున రోజుకు 2 పూటలు వేసుకోవాలి.
నెయ్యి కాని ,నువ్వుల నూనె కాని మెడ బాగంలో తిన్నగా మర్దించి ఆముదపు ఆకులను గాని ,జిల్లేడు ఆకులను గాని నూనె పూసి సెగ పెట్టి కాపాలి.
కోడి గుడ్డు లోని సొనను వేడి చేసి అందులో సైంధవ లవణం కలిపి మెడ బాగంలో మర్దన చేయాలి.
రోగి బలహీనులైనచో ఒక స్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని పాలతో కలిపి వాడాలి.
ఇవి కాక వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడవలసిన కొన్ని ఆయుర్వేద ఔషధాలు వుపయోగించి ఈ వ్యాధి నుండి పూర్తిగా బయట పడవచు.


వీర్య వృద్ధి
[1].నేతిలో వేయించిన మినప పప్పును ఆవు పాలలో వేసి తగినంత చెక్కర కలిపి పాయసంలా వండి రోజు తింటూ వుంటే శరత్కాలము లోని చంద్రుని వలె పురుషులు వలె పురుషులు వీర్య దోష వర్జితులై ప్రకాశిమ్పగలరు.
[2].కర్జూర పండు ,మర్రి వూడలు కలిపి పాలతో నూరి వడపోసి తాగుతూ వుంటే అమితమైన వీర్య వృద్ధి కలుగుతుంది.
[3].అతిమధురం ,నెల తాడి దుంపలు ,పిప్పళ్ళు ,దూల గొండి గింజలు ఈ 4 సమబాగాలుగా తీసుకుని చూర్ణం కొట్టి నిలువ వుంచుకోవాలి.పూటకు 3gm ల చూర్ణము ,6gm పటిక బెల్లం పొడి ,6gm ఆవు నెయ్యి ఒక గ్లాస్ ఆవు పాలల్లో కలిపి 2 పూటలా తాగుతూ వుంటే అమితమైన వీర్య వృద్ధి అవుతుంది.
[4].తులసి విత్తులు , నాగాకేసరములు ,అశ్వగంధ ,మోదుగ ,రావి ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క gm వంతున సేకరించి బాగుగా మర్దించి వస్త్ర గాలితము గావించి 10gm ఆవు పాలలో కలిపి సేవించిన 2 నెలల్లో బహిష్టు సక్రమ మగును ,ఏదో కారణమూ చేత ఆగిపోయిన బహిష్టు కూడా సరిఅగును.

బహిష్టు నొప్పి
రుతుమతులైన దినములందు 3 రోజుల పాటు ప్రతి ఉదయం 2gm మిరియాల చూర్ణమును 10gm నెల ఉసిరిక రసంతో కలిపి మింగిన యెడల రుతువుల నిస్సంశయముగా హరిన్చిపోవును.

బహిష్టు ఆగిపోతే
[1].వేప చెట్టు బెరడు 20gm ,శోంటి 2gm ,పాతబెల్లం 20gm ఈ మూడు కలిపి దంచి అర లీటర్ నీటిలో వేసి పావు లీటర్ కషాయం మిగిలేల మరగబెట్టి వడపోసి చల్లార్చి రోజు ఉదయం పూట మాత్రమే తాగుతూ వుంటే 4 రోజుల్లో ఆగిపోయిన బహిష్టు మళ్ళి మొదలవుతుంది.
[2].ప్రత్తి కాయలు పగులగొట్టి నీటిలో వేసి కషాయం కాచి వడ పోసి అర పావు లీటర్ కషాయంలో 20gm పాత బెల్లం కలిపి రోజు ప్రాతఃకాలమందు తాగుతూ వుంటే అతిత్వరలోనే బహిష్టు మొదలవుతుంది.
[3].అరటి ఊచ రసము 2 పూటలా 20gm మోతాదుగా సేవిస్తూ వుంటే ఆగిపోయిన బహిష్టు మరల మొదలై సాఫీగా వస్తూ వుంటుంది.

స్త్రీల స్తనముల బాధ
వెర్రి పుచ వేరును మంచి ఆ గంధాన్ని చన్నుల మీద లేపనం చేస్తూ వుంటే స్థానాలకు సంబంధించిన అన్ని బాధలు హరిన్చిపోతై.



బహిష్టు లో అధిక రక్త స్రావానికి
యష్టి మధుకం చూర్ణం పూటకు 3gm మోతాదుగా ఒక కప్పు బియ్యం కడిగిన నీళ్ళల్లో 3 పూటలా తాగుతూ వుంటే అతి త్వరగా అధిక ఋతు స్రావము ఆగిపోతుంది.

వీర్య శక్తి
యావాలు మినుములు నానబెట్టి పొట్టు తీసి ఆ పొడిని పాలలో కలిపి పంచదార వేసి పాయసం లాగ వండి రోజు తింటూ వుంటే 40 రోజు లా తరువాత అమితమైన వీర్య శక్తి కలుగుతుంది.






ప్రత్తి చెట్టు ఔషధగుణాలు
  ప్రత్తి వేరును బియ్యం కడిగిన నీళ్ళతో మెత్తగా నూరి వడపోసి ,ఆ రసం 20gm ,మోతాదుగా 2 పూటలా సేవిస్తూ వుంటే చర్మ రోగాలు తగ్గిపోతాయి.

చర్మ రోగములు
ప్రత్తి వేరు ను ,ప్రతి పూవులను కలిపి నూరి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ వుంటే చర్మ రోగాలు తగ్గి పోతాయి.

కీళ్ళ నొప్పులకు
లేతగా ఉన్న ప్రతి ఆకును మెత్తగా దంచి ,ఆముధముతో గాని ,ఆవు నెయ్యి తో గాని ఉడికించి. కీళ్ళ మీద వేసి కడుతూ వుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

విషాల విరుగుడుకు
ఎర్ర పతి కాయలను దంచి రసం తీసి వడ పోసి 20 gm మోతాదుగా 2 లేక 3 సార్లు తాగితే నాబి మొదలైన పదార్ధాల విషం విరుగుతుంది.

కాలిన పుండ్లకు
ప్రత్తి పూవులను దంచి రసం తీసి ఆ రసాన్ని కాలిన పుండ్ల మీద లేపనం చేస్తూ వుంటే కాలిన పుండ్లు తగ్గిపోతాయి.

విరేచనం
ప్రతి ఆకు నీటిలో వేసి మరిగించి దాని ఆవిరి గుద స్థానానికి తగిలేలా చేసుకుంటే ,మాటిమాటికి విరేచనం అవుతున్నట్లుగా వుండే సమస్య నివారిమ్పబడుతుంది.

సుక ప్రసవము
ప్రతి ఆకు రసము గిద్దెడు ,ఆవు పాలు గిద్దెడు కలిపి తాగిస్తే స్త్రీలు సుకంగా ప్రసవిస్తారు.







పండ్ల లోని క్రిములకు
ప్రత్తి గింజలను బాండీలో వేసి మాడ్చి ఆ మసితో పళ్ళు తోముకుంటే పళ్ళ లో చేరిన పురుగులు హరించి పళ్ళు ఆరోగ్యవంతంగా వుంటాయి.

కళ్ళ నొప్పులకు
ప్రత్తి ఆకులను మజ్జిగతో ఉడకబెట్టి కళ్ళ మీద వేసి కట్టుకుంటూ వుంటే కండ్ల నొప్పులు సులువుగా పోతాయి.

కను రెప్పలు ఊడుతూ వుంటే
మంచి ప్రత్తిని ఒక గిన్నెలో వేసి అది మునిగేల ఉమ్మేత్తాకు రసం పోసి రాత్రి అంతా నానబెట్టి ఉదయం పూట ఎండలో పెట్టి రసమంతా ఎగిరి పోయే ల ఎండబెట్టాలి.ఇలా 3 రోజు ల పాటు ఉమ్మేత్తాకు రసం తోను ,3 రోజుల పాటు గుంటగలగార ఆకు రసం తోను బావన చేసి బాగా ఎండిన తరువాత ఆ ప్రత్తి వత్తి లాగ చేసి నువ్వుల నూనె దీపంలో వేసి వెలిగించి ,దాని మంట మీద రాగి పళ్ళెం ఆనించి దానిని మసి పట్టి ఆ కాటుకాను ప్రతి రోజు కండ్లకు పెట్టికొంటూ వుంటే కను రెప్పల వెంట్రుకలు ఊడటం ఆగిపోతుంది.

చెవిలో చీముకు
ప్రతి ఆకులు దంచి రసం తీసి వడపోసి ఆ రసంలో కొద్దిగా గుగ్గిలం ,తేనె కలిపి ,చెవుల్లో 4 చుక్కలు వేస్తూ వుంటే చీము కారటం తగ్గిపోతుంది.

సెగ రోగములకు
ప్రతి గింజలు ,దిరిసెన గింజలు ,పెను వేప గింజలు సమంగా కలిపి అందులో తగినన్ని మర్రి పాలు పోసి ముద్దగా దంచి ఆ ముద్దను బటాని గింజలంత టాబ్లెట్ చేసి ఆరబెట్టి నిలవ చేసుకోవాలి.రోజు ఉదయం పూట ఒక టాబ్లెట్ వేసుకుని పాలు తాగుతూ వుంటే సకల సెగ రోగాలు హరించి పోతాయి.

బహిష్టు ఆగిపోతే
ప్రతి కాయలు పగులగొట్టి నీటిలో వేసి కాషాయం కాచి వడపోసి ,అరపావు లీటర్ కషాయం లో 20gm పాత బెల్లం కలిపి ప్రాతకాలంలో తాగుతూ వుంటే అతి త్వరలోనే బహిష్టు విడుదల అవుతుంది.

వాపులు-వాత నొప్పులు
ప్రత్తి గింజలను నీళ్ళల్లో నానబెట్టి మెత్తగా నూరి వాపుల మీద వాత నొప్పుల మీద పట్టు వేస్తూ వుంటే అవి తగ్గి పోతాయి.

కాళ్ళ వాపులకు
ప్రతి ఆకు దంచి రసం తీసి ఆ రసాన్ని రాత్రి పూట కాళ్ళకు పట్టిస్తూ వుంటే కాళ్ళవాపులు 4 రోజుల్లో తగ్గి పోతాయి.

గవద బిళ్ళలు
ప్రతి ఆకు దంచి చక్కటి రసం తీసి ఆ రసాన్ని గవద బిళ్ళల మీద లేపనం చేసి పైన దూది అంటిస్తూ వుంటే గవద బిళ్ళలు కరిగిపోతై.

ఎలుక కాటు విషానికి
ప్రతి ఆకు రసం 50gm ,బియ్యం కడిగిన నీళ్ళు 100gm ,కలిపి రోజుకొక మోతాదుగా రోజు ఉదయం పూట తాగుతూ వుంటే ఎలుక కాటు విషం ఎగిరి పోతుంది.

సుక ప్రసవం
ప్రత్తి గింజలు ,మర్రి ఊడల కోణాలు ,గుమ్మడి ఆకులు ఈ 3 సమంగా తీసుకుని మంచి నీటితో మేతగా నూరి ఆ కల్కాన్ని గర్బిణీ స్త్రీ అరికాళ్ళకు లేపనం చేస్తూ వుంటే త్వరగా సుక ప్రసవం జరుగుతుంది.

గడ్దలకు-బిళ్లలకు
ప్రత్తి గింజలను నీళ్ళతో ముదగా నూరి ఆ ముద్ద ను గడ్డల మీద లేక బిల్లల మీద వేసి కడుతూ వుంటే అవి త్వరగా తగ్గిపోతాయి.

రక్త - జిగట విరేచనాలు
ప్రత్తి ఆకుల రసం 30gm పటిక బెల్లం పొడి 30gm , కలపి పూటకు ఒక మోతాదుగా రోజుకు 2 లేక 3 సార్లు పుచుకొంటూ వుంటే సులువుగా రక్త ,జిగట విరేచనాలు ఆగిపోతాయి.

తేలు విషానికి
ప్రతి ఆకులు ,ఆవాలు కలిపి మేతగా నూరి ఆ మిశ్రమాన్ని తెలుకుట్టినచోట వెంటనే మర్దిస్తే విషం వెంటనే క్రిందకు దిగి ,బాధ నిమిషాల మీది తగ్గిపోతుంది.


పిచ్చి కుక్క కాటుకు చికిత్సలు


[1].గోవు పిత్తము ,తేనె ఈ 2 సమంగా గ్రహించి మనిషి మూత్రములో మెత్తగా నూరి దాన్ని రోగికి అరికాళ్ళకు లేపనం చేస్తూ వుంటే పిచ్చి కుక్క విషం విరిగి పోతుంది.
[2].అడవి జీలకర్ర అంటే చేదు జీలకర్ర తెచ్చి పొడి కొట్టి పూటకు 10gm ప్రమాణంగా మంచి నీటితో కలిపి 2 పూటలా సేవిస్తూ వుంటే కేవలం 3 రోజుల్లోనే మహా గోరమైన వెర్రి కుక్క విషము నిస్సంశయంగా హరిస్తుంది.
[3].కలబంద రసము ,సైంధవ లవణము 2 కలిపి వేడి చేసి గోరువెచ్చగా వున్నప్పుడు 20gm మోతాదుగా 2 పూటలా సేవిస్తూ వుంటే 3 రోజుల్లోనే వెర్రి కుక్క విషం హరిన్చిపోతుంది.
[4].ఉత్తరేణి వేరు తేనె తో నూరిన ముద్ద 10gm మోతాదుగా 2 పూటలా సేవిస్తూ కలబంద గుజ్జు సైంధవ లవణము కలిపి నూరిన ముద్దను గాయం మీద వేసి కడుతూ వుంటే పిచ్చి కుక్క విషం విరుగుతుంది.
[5].వేప విత్తనాలు ,కోడి శిపాల విత్తనాలు ,చందనము ,తామర పూవులోని కేసరాలు ఈ 4 సమబాగాలుగా కలిపి నూరి 20 gm మోతాదుగా 2 పూటలా ఆవు పాలతో కలిపి తాగుతూ వుంటే వెర్రి కుక్క విషము విరుగుతుంది.
[6].10gm మనిషి వెంట్రుకలను కాల్చి మసి చేసి ఆ మసిని నువ్వుల నూనె లో కలిపి తాగిస్తే వెర్రి కుక్క విషం విరుగుతుంది.
[7].కాకరాకును నూరి పసరు తీసి ఆ పసరును శరీరమంతా లేపనం చేసి అది ఎండిపోగానే స్నానం చేస్తూ వుంటే విషం హరిస్తుంది.
[8].కుప్పింతాకు[మార్కొండాకు) ,వెల్లుల్లి ఈ 2 సమంగా కలిపి నూరి ఆ ముద్దను ఆముదములో కలిపి ఉడకబెట్టి 3 రోజు ల పాటు 2 పూటలా పూటకు 10 నుండి 20gm మోతాదుగా సేవింప చేస్తూ వుంటే వెర్రి కుక్క ,నల్ల పిల్లి విషం హరిస్తుంది.
[9].సుగంధ పాల వేళ్ళు రసం తీసి వడపోసి ,2 పూటలా పూటకు 50gm మోతాదుగా తాగిస్తూ వుంటే విషం విరుగుతుంది.
[10].కానుగ చెట్టు వేళ్ళను దంచి రసం తీసి ఆ రసాన్ని వడపోసి 2 పూటలా పూటకు 50gm మోతాదుగా తాగిస్తూ వుంటే విషం విరుగుతుంది.
[11].విష్ణుక్రాంత సమూలముగా గాని ,సూర్యక్రాంత సమూలముగా గాని తీసుకొచ్చి మనిషి మూత్రములో నూరి రసం తీసి వడపోసి 3 రోజు ల పాటు 2 పూటలా సేవిస్తూ వుంటే వెర్రి కుక్క విషం హరిస్తుంది.
[12].మంచి పసుపు ,చేగాల్వ కోష్టు ఈ 2 సమంగా తీసుకుని గోమూత్రములో కలిపి నూరి వడపోసి 2 పూటలా సేవిస్తూ వుంటే వెర్రి కుక్క విషం హరిస్తుంది.
[13].తెల్ల గురివింద వేరు వస సమంగా కలిపి నూరి గంధం తీసి ఆ గంధాన్ని చల్లని నీటితో కలిపి తాగిస్తూ వుంటే విషం హరిస్తుంది.
[14].చేదు సొరచెట్టు వేరు గాని ,ఆకు గాని ,బెరడు గాని మంచి నీటితో నూరి వడ పోసి పూటకు 5gm మోతాదుగా 2 పూటలా సేవిస్తూ వుంటే 3 రోజుల్లో వెర్రి కుక్క విషం హరిస్తుంది.
[15].బెల్లము ,నువ్వుల నూనె ,జిల్లేడు పాలు ఈ 3 కలిపి నూరి గాయం మీద పట్టించిన లేక బెల్లపు పాకం లాగ ఎర్రగా జిగటగా వుండే కోడి మలాన్ని గాయం మీద లేపనం చేసినా వెర్రి కుక్క విషం విరిగి హరిన్చిపోతుంది.






పసుపు తో ఆయుర్వేదం


దగ్గులు-పిల్లికూతలు
వగర్పు దగ్గులు ,పిల్లి కూతలు మొదలైన శ్వాస కోశ వ్యాధులున్నవారు పసుపు కొమ్ములను నిప్పుల మీద కాల్చి చల్లార్చిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసి బుగ్గన పెట్టుకుని చప్పరించి దాని రసం మింగుతూ వుంటే దగ్గు ,పిల్లి కూతలు తగ్గుతాయి.
నేత్ర వ్యాధులు
పరిశుబ్రమైన పసుపు కొమ్మును నీటితో సాది ఆ గంధాన్ని పెసర బద్ధంత మోతాదుగా కలిములాగా రోజు రాత్రి పూట వాడుతూ వుంటే నేత్ర వ్యాధులు హరిస్తై.
గడ్డలు ,గాయాలు ,బెనుకులు
పసుపు గాని ,పసుపు దంచిన ముద్దను గాని పైన వేసి కట్టడం వల్ల వ్రనములు ,గడ్డలు ,గాయాలు ,కవుకు నొప్పులు ,బెనుకులు హరించి పోతాయి.
తల రోగములు
పసుపు కొమ్మును గంధం తీసి పైన లేపనం చేసిన లేక పైన పట్టు లాగా వేసిన దాని మీద కాపడం పెట్టిన తలదిమ్ము ,తల పోట్లు ,పార్శ్వపు నొప్పి , అపస్మారము శాంతిస్తై.పసుపు పూల రసం గాని ఆకుల రసం గాని వాడిన అదే ఫలితం కలుగుతుంది.
చెవిలో చీము
పసుపు పొడి ,పటిక పొడి కలిపి దూడతో చెవిలో పెట్టి ఊదితే చెవి నుండి కారే చీము ,నెత్తురు ,రసిక తగ్గి పోతాయి.
గోరుచుట్టూ -మడమశీల
పసుపును సున్నపు నీటిలో ఉడక బెట్టి గాని లేక నూనెలో వుడకపెట్టి కాని పైన వేసి కడుతూ వుంటే గోరు చుట్టూ ,మడమ శూల ,జెట్టలు ,గడ్డలు ,కానుపు మాదలు మొదలైనవి హరించి పోతాయి.
పురుగులకు
పసుపు చూర్ణం నీటిలో కలిపి ఆ నీటిని ఇంట్లో చల్లితే పురుగులు నశిన్చిపోతై.
స్పోటకం మచ్చలకు
పసుపు ,వేపాకు కలిపి ముదగా నూరి నూనె కలిపి వంటికి లేపనం చేస్తూ వుంటే స్పోటకం తాలుకు మచ్చలు ,పుండ్లు మానిపోతై ఇదే ప్రక్రియ ప్రకారం అనేక చర్మ వ్యాధులను సైతం అరికట్టవాచు.
మధుమేహం
మంచి పసుపు ,ఉసిరిక కాయ బెరడు చూర్ణము ఈ 2 సమబాగాలు కలిపి చూర్ణం చేసి రోజు 2 పూటలా 10gm మోతాదుగా మంచి నీళ్ళతో సేవిస్తూ వుంటే క్రమంగా మధుమేహం కుదురుతుంది.
కనురెప్పలు రాలుతుంటే
నిమ్మపందుకు రంధ్రం చేసి అందులో పసుపు కొమ్మును దూర్చి 3 రోజులు నానబెట్టాలి .తరువాత దాన్ని తీసి ఎండబెట్టాలి.మళ్ళీ వేరొక నిమ్మపండులో దాన్ని గుచ్చి 3 రోజులుంచి తీసి ఎండబెట్టాలి.ఇలా చేసిన తరువాత బాగా ఎండిన ఆ పసుపు కొమ్మును నిలవ చేసుకుని రోజు రాత్రి నిద్ర పోయే ముందు ,కొంచెం నీటితో సాది ఆ గంధాన్ని కంటికి కాటుక లాగ పెట్టు కొంటూ వుంటే కంటి రెప్పలు ఊడిపోవడం ఆగిపోతుంది.



మర్రిచెట్టు తో ఆయుర్వేదం


[19]. లేత మర్రి చెట్టు ఊడలను నీళ్ళతో మెత్తగా మర్దించి వాలిపోయిన స్తనముల పైన లేపనము చేయుచుండిన 3 వారములలో కన్య స్తనముల వలె ధృడముగా ఉండును.

[20]. లేత మర్రి ఆకులను నీడన ఆరబెట్టి ,ఎండబెట్టి చూర్ణము గావించి పూటకు 3gm చూర్నమును పాలు ,పంచదార కలిపి సేవించు చుండిన 40 రోజు లలో నీరుడు బిగించే మూత్ర కచ్చ వ్యాధి జీవితాంతము రాకుండా హరించి పోవును.

[21]. మర్రి ఊడల చివర వుండు పీచు లాంటి సన్నని వేళ్ళను నీటిలో నూరి త్రాగించుచుండిన యెడల ఏ మందుల వలన కూడా తగ్గనటువంటి డోకులు తగ్గిపోతాయి.

[22]. మర్రి ఊడలను పెరుగుతో నూరి పైన పట్టు వేసిన శరీరము పై కాలిన అంగముల యందలి మంట వెంటనే శాంతించును.

[23]. మర్రి ఊడల కోణాలను దంచి తీసిన రసము పూటకు 2 తులాల చొప్పున ఇచ్చుచుండిన కళ్ళతో రక్తము పడే వ్యాధి హరించును.

[24].లేత మర్రి ఊడలను నీడన ఆరబెట్టి ,ఎండించి చూర్ణము గొట్టి అందు సమబాగమున పంచదార కలిపి పూటకు అర తులము చొప్పున వారము రోజులు సేవించిన యెడల మూత్రము ,పచగా వాచుట ,వీర్యము పలుచబదుట ,మూత్రము బోయునప్పుడు మంట మొదలగు మెహ వ్యాధులు హరించి శరీరమునకు బలము కలుగును.

[25]. కత్తి మొదలగు ఆయుధములచే పెద్ద పెద్ద గాయములు ఏర్పడినపుడు గాయము యొక్క 2 అంచులను ఒకటిగా జేర్చి పైన వెచ్చజేసినా మర్రి ఆకును వేసి కట్టు కట్టిన యెడల 3 రోజులలో చర్మం ఆశ్చర్యముగా కలిసిపోవును.

[26]. మర్రిచెట్టు యొక్క పాచి కాయలను ఎండించి ,చూర్ణము గావించి పాటకు 15gm చూర్నమును అర గ్లాస్ పాలు పంచదార కలుపుకుని సేవించుచుండిన యెడల శరీరమునకు అధిక బలము కలుగును.

[27]. ఎండించిన మర్రి ఊడలను బస్మము గావించి 3gm బస్మమును నీళ్ళతో కలిపి ఇచ్చు చుండిన యెడల డోకులు కట్టును ,వంతులు హరించును.

[28]. సెగ గడ్డల పైన మర్రి ఆకును వేచా జేసి కట్టిన యెడల తొందరగా పగిలి పోవును.

[29]. పండు మర్రి ఆకులను కాల్చి బస్మము చేసి అందు తేనె ,మైనము ,నెయ్యిని ,కలిపి మేతగా నూరి పుండ్లు పై పట్టించిన యెడల అన్ని రకముల పుండ్లు హరించును.

[30]. లేత మర్రి ఆకులను ఎండబెట్టి చూర్నించి అందు సమబాగమున పంచదార కలిపి 10gm చొప్పున మంచి నీళ్ళు అనుపానముతో సేవించు చుండిన స్త్రీల యొక్క తెల్ల బట్ట వ్యాధి హరించును వేడి చేసే పదార్ధాలు తినకుండా ఉండవలెను.

[31]. లేత మర్రి ఆకులూ మెత్తగా నూరి అందు తేనె పంచదార కల్పుకుని ప్రాతహకాలమందు తినుచుండిన యెడల రక్త పిత్త వ్యాధి తగ్గును.







మర్రిచెట్టు తో ఆయుర్వేదం


[1]. మర్రి ప్రాంతకాలమందు ఒక గ్రాము ఎత్తు చొప్పున మొదటి రోజున పంచదార పాకములో కలిపి పుచుకోనవలెను.2 వ రోజు 2gm ఏతు మర్రిపాలు పంచదార పానకములో కలిపి పుచ్చుకొనవలెను.ఇట్లు రోజుకు ఒక్కొక్క gm పాలు ఎక్కువ చేయుచు 11 రోజులు సేవించి 12 వ రోజు నుంచి ఒక్కొక్క gm ఏతు పాలు తాగించుచు తిరిగి gm ఏతు పాలు తగ్గించుచు తిరిగి 11 రోజు లు మర్రి పాలను పంచదార పానకములో కలిపి సేవించు చుండిన యెడల వీర్య నష్టము ,మూత్ర బంధము ,స్త్రీల బట్టంటూ వ్యాధులు సంపూర్ణముగా హరించి మెదడుకు ,గుండెకు బలము కలిగి ,శరీరము ఆరోగ్యముతో పుష్టిగా ఉండును.

[2]. నీళ్ళల్లో ,బురదలో తిరుగుచుండె వారికి కాళ్ళ వెల్ల సందులో పాచి పుండ్లు పడి,అపరిచితమైన దురదలు ,బాధలు కలుగుచుండె వారికి కాళ్ళ వెల్ల సందులో మర్రి పాలు పట్టించు చుండిన అన్ని బాధలు తక్షణమే తగ్గిపోవును.

[3]. శరీరము పైన ఎక్కడైనా మంటగా ఉన్న యెడల మర్రి పాలు పైన రాసిన వెంటనే తగ్గిపోవును.

[4].కాళ్ళ పిక్కల పైన, తొడల పైన లేచెడి కురుపులకు గడ్దలకు మర్రి పాలు పట్టి వేసిన తొందరగా అణిగి పోవుట గాని పగిలిపోవుట గాని జరుగును.

[5]. నడుము నొప్పికి పైన మర్రి పాలు పట్టీ వేసిన యెడల తగ్గిపోవును.ఇట్లు 3 పట్టీలు వేయవలెను.

[6]. పిప్పిపంటిపై మర్రి పాలు 3 చుక్కలు వేసిన పురుగు చచ్చి బాధ తగ్గును.

[7]. చెవి పోటుకు 2 చుక్కల మర్రి పాలు చెవిలో వేసిన పురుగు చచ్చి చెవి పోటు తగ్గును.

[8]. ఒక చుక్క మర్రి పాలను కంట్లో వేసిన కంట్లో మంటలు తగ్గిపోవును.

[9]. పోటు పుట్టుచుందే సెగ గడ్డలపైన ,మర్రి పాలు పట్టి వేయుచుండిన యెడల బాధలు వెంటనే శాంతించును.

[10]. బొడ్డు లోపల ,బొడ్డు చుట్టూ మర్రి పాలు పట్టించిన యెడల అన్ని రకముల విరేచనములు అద్బుతముగా తగ్గును.

[11]. 2gm మర్రిపాలను పంచదార లో కలుపుకుని ప్రాంత్హకాలమందు తినవలెను ఇట్లు 3 రోజులు ఉదయం పూట తినిన యెడల మూత్ర బంధము మూత్రము బొట్లు బొట్లు గా పడుట హరించును.

[12]. రాకత మొలల వ్యాధి వలన గాని ,స్త్రీల ఎర్రబట్ట వ్యాధి వలన గాని లేక మరియే ఇతర కారణము చేతనైన శరీరము నుండి పై బాగము గుండా రక్తము పోవు చున్న యెడల 5,6 చుక్కల మర్రి పాలను పంచదార పానకములో తాగించావలెను.

[13]. మెడ చుట్టూ గడ్డలు లేచే కంట మాల వ్యాధి పైన మర్రి పాలు పట్టీ వేయుచుండిన యెడల తొందరగా నయమగును.

[14]. కత్తి నరుకులపై గాని లేక ఏ విధమైన గాయముల పై గాని మర్రి పాలను పట్టించిన యెడల గాయమును తొందరగా మాన్పి ,చర్మమును అతుక్కోనునట్లు చేయును.

[15]. మర్రి చెట్టు పై చర్మమును దంచి నీళ్ళల్లో కాచి ఇచ్చిన అతి మూత్ర వ్యాధి హరించును.

[16]. మర్రి చెట్టు పాచి బెరడును దంచి తీసిన రసమును పూటకు 10gm చొప్పున త్రాగించుచుండిన యెడల మధుమేహ వ్యాధి నిస్సందేహముగా హరించును.

[17]. మర్రి చెక్క ,రావి చెక్క 2 కలిపి దంచి ,కషాయము కాచి ఆ కశాయముతో పుక్కిలించి ఉమ్మి వేసిన యెడల చిగుళ్ళ వాపు వంటి బాధలు హరించును.

కలబంద(ఆలోవీర) తో ఆయుర్వేదం


[1]. కలబంద గుజ్జును చెక్కెర తో కలిపి సేవించడము గాని ,రసాన్ని తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని ,ఆరోగ్యాన్ని పొందవచ్చు.

[2].కలబంద రసం ,పాలు ,నీళ్ళతో కలిపి సేవిస్తే ,సెగ రోగం ,గనేరియా మెహ వ్యాధులు ఉపశామిస్తాయి.

[3].కలబంద గుజ్జును ఉడికించి వాపులు ,గడ్డల పై కడితే తగ్గి పోతాయి.

[4].కలబంద రసం లేదా వేరు ను పసుపు తో నూరి లేపనము చేసిన స్థానవాపు తగ్గి పోతుంది.

[5].కలబంద రసాన్ని పసుపు తో కలిపి సేవిస్తే లివర్ ,స్ప్లీన్ వ్యాధులు ఉపశామిస్తాయి.

[6].కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక వ్రణాలు త్వరగా మానిపోతాయి.

[7].రోజు ఉదయం సాయంత్రం 1 1/2 అంగుళాల కలబంద ముక్కను బుజించిన చిరకాలంగా నున్న మలబద్దకము తగ్గిపోతుంది.

[8].కలబంద రసం నిత్యం సేవించుచుండిన స్థౌల్యము తగ్గుతుంది.

[9].కలబంద రసాన్ని లేపనము చేసిన అన్ని రకములయిన చర్మ వ్యాధులు ,సూర్య తాపము వలన ,X-RAY వలన ఏర్పడు చర్మ రోగాములతో సహా ఉపశామిస్తై.

[10].చర్మ సౌందర్యానికి ,ముకములో స్నిగ్దత్వాన్ని కలిగించడానికి కలబందను ప్యాకులలోను ,వివిధ ముకలేపనాలలో ఉపయోగించటమే కాక ,దీని గుజ్జును కూడా అంటించవచ్చు.

[11].కఫా వ్యాదులలో కలబంద రసాన్ని పసుపులో కలిపి ఎదురురొమ్ముపై రుద్దిన ఉపశమనం కలుగుతుంది.

[12].పంటి నొప్పి ,పండ్లు కదులుట యందు కలబంద రసముతో చిగుల్లపై రుద్ధటము గాని ,కలబంద ఆకు ముక్కను నములుట గాని చేయాలి.

[13].దగ్గు నివారణకై 1 స్పూన్ ,మిరియాలు 1/4 స్పూన్ , శొంటి 1/4 స్పూన్ ,తేనె లో కలిపి సేవించాలి.

[14].కడుపు నొప్పి లోను ,కడుపు లో గ్యాస్ ఏర్పడినపుడు ,గోధుమ పిండి ,కలబంద గుజ్జు పై వాము ,సైంధవ లవణము ,జీలకర్ర కలిపి చపాతీలు చేసుకుని బుజించాలి.

[15].అర్శ మొలల యందు 10 నుండి 30 గ్రాముల కలబంద రసం తాగిస్తూ ,కలబంద గుజ్జు పసుపు కలిపి అర్శమొలల పై లేపనము చేయాలి.

[16].చెవి పోటు యందు కొంచెము వేడి చేసి పిండిన కలబంద ఆకు రసాన్ని 1,2 చుక్కలు చెవిలో వేయాలి.

[17].కండ్ల కలక యందు కలబంద ఆకు గుజ్జు కండ్లపై వేసి కట్టాలి.

[18].ఎండాకాలము వడదెబ్బ నందు కలబంద రససేవనం గ్లుకోస్ వలె పనిచేస్తుంది.

[19].కలబంద గుజ్జు ను నీళ్ళల్లో బాగా కడిగిన తరువాత మాత్రమే లోపలికి గాని బయటకు గాని తీసుకోవాలి.



అతి సులువైన జానపద వైద్య విధానాలు


గొంతులోని పుండ్లు మరియు కాంతులు నివారణకు
బోజనము ముందు నేతిలో మిరియము పొడిని 2gm మోతాదుగా కలిపి సేవించవలెను .

నడుము నొప్పి
[1].హారతి కర్పూరము ,సాంబ్రాణి మెత్తగా నూరి గుడ్డకు పట్టించి పట్టు వేయవలెను.

[2].నొప్పి గల చోట బాగుగా ఆముధమును రాసి జిల్లేడు ఆకుల విస్తరి కుట్టి నొప్పి గల చోట కట్టి నులక మంచము పెట్టి క్రింద మేక ఎరువుతో కుంపటి పెట్ట వలెను.

[3].దేశవాళి గుగ్గిలము ఆముధమున నూరి నీళ్ళను కడిగిన వెన్న వలెనగును.దానిని గుడ్డకు పట్టించి పట్టు వేయవలెను.

[4].కర్పూర తైలముతో పట్టు వేయవలెను.

పెదవుల పగుళ్ళు
ఉప్పును నేతితో నూరి పెదవులకు పూసిన పగుళ్ళు మానును .

కాలిన గాయాలు
[1].మజ్జిగలో సుద్దను కలిపి రాయవలెను.

[2].కాలిన గాయాల పై చల్లని తడి మన్నును రాయవలెను.

[3].మూత్రమును ఆరగ ఆరగ రాయవలెను.

[4].కలబంద రసమును వేసి కట్టు కట్టవలెను.

[5].సున్నపు నీళ్ళలో కొబ్బరి నూనె ను వేసి గట్టిగా చిలికి దానిలో గుగ్గిలము పోడుమును వేసి పాకముగా వండి పూయవలెను.

[6].కాలిన చోట బ్రాంది పోసిన పొక్కక మంటను తగ్గించును.

అజీర్ణము
[1].వాము ,ఉప్పు ,మిరియాలు సమపాళ్ళల్లో కలిపి దోరగా వేయించి పొడి చేసి పరగడుపున మూడు వేళ్ళకు వచునంత సేవించవలెను.

[2].రెండు చింత గింజలను పెనం పై కాల్చి పోట్టును గీకి వేసి నోటిలో వేసుకుని పోకల వలె నమిలి మింగిన అజీర్ణము దానివలన కలిగిన గుండె మంట నివారనమగును.

[3].40gm నిమ్మరసములో ,జీలకర్ర 3 gm ,సైంధవ లవణము 3gm ,అల్లపు ముక్కలు 10gm ,వేసి 3 గంటలు నానబెట్టి ప్రతి రోజు ఉదయము తినవలెను.

[4].దాల్చిన చెక్క ,యాలకులు ,మిరియాలు సమపాళ్ళలో పొడి చేసి కలిపి పొడి చేసి పూటకు 3gm చొప్పున బెల్లముతో కలిపి పుచ్చుకోనవలెను .

[5].నీరుల్లిపాయను పచ్చి దానిని ముక్కలుగా కోసి బోజనముతో తినవలెను.

[6].నేతిలో వండిన అన్నమును బుజించిన చక్కగా జీర్ణమగును.

[7].నిమ్మరసములోతినే సోడాను 5 gm కలిపి ఒక ఔన్సు నీళ్ళను కలిపి తాగవలెను.

[8].గిద్దెడు నీళ్ళల్లో ఒక తులము ఉప్పును కలిపి తాగవలెను.

[9].పంచదార లేక బెల్లపు పానకమును పుచ్చుకోనవలెను .

[10].రాత్రి రాగి చెంబులో పోసి యుంచిన నీటిని ఉదయము పరగడపున తాగవలెను.

ఆకలి అగుటకు
[1].రెండు గ్రాముల అల్లములో కొంచెము ఉప్పును వేసి ఉధయముననే తినవలెను.

[2].5gm ల శోంటి చూర్నమును పావు గ్లాస్ బియ్యము కడిగిన నీళ్ళల్లో కలిపి పూచుకోనవలెను.

అరుచి
[1].కాల్చిన అల్లపు ముక్కను ఉప్పు తో అది తినవలెను.

[2].ఆవాలను నూరి నాబి పైన ప్రతి రాత్రి పట్టు వేయవలెను.

[3].అల్లపు రసములో తేనె ను కలిపి నాకవలెను.

[4].బోజనమున మొదటి ముద్దలో శోంటి పొడి ఉప్పు తో కలిపి తినవలెను.

శ్వేత కుష్టు(బొల్లి)
[1].వేప కాయలు , పువ్వ్వులు , ఆకులను కలిపి నూరి అర తులము పూటకు చొప్పున 4 రోజులు సేవుంచావలెను.

[2].రోగి పురుషుడైన స్త్రీ ఋతు రక్తమును శ్వేత కుష్టు మచలపై పూయవలెను.రోగి స్త్రీ అయిన పురుషుని ఇంద్రియమును మచ్చల పై పూయవలెను .ఇట్లు చేసిన శ్వేత కుష్టు మచ్చలు శాశ్వతముగా నివారనమగును.

నేత్ర వ్యాధులు
కలబంద లో పటిక కలిపి కండ్లలో పోసిన కంటి దెబ్బలు పోవును.


గసగాసాలతో ఆయుర్వేదం


వీర్యస్తంబనకు
పది గ్రాముల గసగసాలను కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి ,అర కప్పు పాలల్లో కలిపి అందులో 20 gm పటిక బెల్లం పొడి కలిపి రోజు 2 పూటలా తాగుతూ వుంటే వీర్య స్థంబన కలుగుతుంది.
దేహమునకు చలువ చేయుటకు
10gm గసగసాలు కొంచెం నీళ్ళతో నూరి తగినంత పటిక బెల్లం కలిపి రోజు తింటూ వుంటే ఉష్ణ శరీరం కలవారు అధిక వేడి తగ్గి దేహం చలువ చేస్తుంది .
చుండ్రుకు-వెంట్రుకలు పెరుగుటకు
గసగసాలను నీటిలో లేదా పాలలో నానబెట్టి మేతగా రుబ్బి తలకు పెట్టుకుని ఆరిన తరువాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తూ వుంటే తలలో కురుపులు చుండ్రు తగ్గి పోయి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి .
శిరోవాతమునకు
గసగసా లు 10gm ,యాలకులు 10gm , సోంపు గింజలు 10gm .ఈ పదార్ధాలను కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి అందులో 60gm ఆవు నెయ్యి కలిపి నీరు ఇరిగే నెయ్యి మిగిలే వరకు చిన్న మంట మీద మరగ బెట్టి దించి వడపోసి నిలువ ఉంచుకుని దీనిని రోజు తలకు రాసుకుంటూ వుంటే తల దిమ్ము ,తల నొప్పి ,పార్శ్వపు నొప్పి హరించి పోయి మనసు ప్రసన్నంగా ప్రశాంతంగా వుంటుంది.
గర్బినీల రక్త జిగట విరేచనాలు
గసగసాలు 10gm లు , పటిక బెల్లం 20gm కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని ,పూటకు 5gm పొడిని 20 gm వేన్నలో కలుపుకుని రోజు 2 లేదా 3 పూటలు తింటూ వుంటే గర్బినీలకు కలిగే రక్త జిగట విరేచనాలు తగ్గిపోవును. అన్నంలో పెరుగు కలుపుకుని తినవలెను.
జిగట విరేచనాలు
గసగసాలు కొంచెం దోరగా వేయించి దంచి చూర్ణం చేసి 2 పూటలా పూటకు 5 gm నుండి 10 GM మోతాదుగా అన్నంలో కలిపి తింటూ వుంటే 2 లేక 3 రోజుల్లో జిగట విరేచనాలు తగ్గిపోతాయి.
నిద్ర రాకపోతే
వేడి చేసిన గసగసాలు మూట గట్టి మాటిమాటికి వాసన చూస్తూ వుంటే నిద్ర వస్తుంది.

 


దాల్చిన చెక్క తో ఆయుర్వేదం


అజీర్ణ రోగము
రోజు బోజనానికి ముందు 2 చిటికలు దాల్చినచెక్క పొడి ,2 చిటికలు శోంటి పొడి ,4 చిటికలు యాలక గింజల పొడి ,కొంచెం మంచి నీళ్ళలో కలిపి తాగుతూ వుంటే అజీర్ణం ,ఆసనం లోని తెపులు తగ్గి పోతాయి.
రక్త విరేచనములు
దాల్చినచెక్క రసములో ,కొంచెం యాలక గింజల పొడి కలిపి సేవిస్తే రక్త విరేచనాలు ,రక్త వాంతులు కట్టుకున్టై .
కఫా జ్వరము
దాల్చిన చెక్క చూర్ణము 3gm ,లవంగా చూర్ణము 2 చిటికలు , శోంటి చూర్ణము 3 చిటికెలు వీటిని ఒక లీటర్ నీటిలో వేసి అరగంట సేపు మరగబెట్టి తరువాత వడపోసి చల్లార్చి 3 గంటలకు ఒకసారి 50gm కషాయాన్ని తాగిస్తూ వుంటే ఊపిరితిత్తులలో కఫము హరించి కఫా జ్వరము హరించి పోతుంది.
కడుపు నొప్పి
దాల్చిన అరకు తెచుకుని అయిదారు చుక్కలు నీటిలో వేసి త్రాగుతో వుంటే కడుపు నొప్పి ,అజీర్ణం ,దగ్గు, ఒగర్పు ,తగ్గుతాయి.ఇంకా ఈ అరకు ఉపయోగించడం వల్ల అత్సార విరేచనాలు ,నీళ్ళ విరేచనాలు తగ్గిపోతాయి.
తలనొప్పి
దాల్చిన చెక్కను నీటితో సాది ఆ గంధాన్ని కనతలకు పట్టు వేస్తూ వుంటే జలుబు తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధించిన తలనొప్పి తగ్గుతాయి.
కొండ నాలుకకు
దాల్చిన చెక్కను నీటితో రాయి మీద అరగదీసి ఆ గంధాన్ని దూది పుల్లకు అది కొండ నాలుకకు రోజు 3 పూటలా అంటిస్తూ వుంటే 2 లేక 3 రోజుల్లో వాలి పోయిన కొండనాలుక యదాస్థానానికి చేరి దగ్గు తగ్గుతుంది.

తేలు కాటుకు
దాల్చినచెక్క తైలం 2 చుక్కలు దూదితో తడిపి తేలు కుట్టిన చోట పైన వేసి గుడ్డతో కడితే తేలు విషం వెంటనే దిగిపోయి బాధ తగ్గిపోతుంది.
కడుపులో క్రిములకు
రాత్రి నిద్ర పోయేముందు 2gm దాల్చినచెక్క చూర్నమును నీళ్ళతో కలుపుకుని తాగుతూ వుంటే కడుపు నొప్పి తగ్గటమే కాకుండా ప్రేగుల్లో వుండే క్రిములు కూడా హరించి పోతాయి.
మతిమరుపు
రోజు ఉదయం పూట 2gm దాల్చిన చెక్క నమిలి తింటూ వుంటే క్రమంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

 
అనపకాయ(సొరకాయ) తో ఆయుర్వేదం


వీర్య స్థంబనకు
సొరకాయ ముక్కలను ఆవు నేతిలో పరిమితంగా తింటూ వుంటే శీగ్ర స్కలన సమస్య తగ్గి పోయి రతిలో ఎక్కువ సేపు వీర్యం నిలుస్తుంది.
మూత్ర బిగింపునకు
బాగా పండిన అనపకాయ తీగను సమూలముగా తీసుకుని కాల్చి బస్మము చేసి ,ఆ బస్మాన్ని నీటిలో వేసి పొయ్యి మీద పెట్టి నీరు ఇగిరి పోయే వరకు మరిగించి అడుగున మిగిలిన దాని క్షారం తీసి నిలువ వుంచుకోవాలి. మూత్రం బాదిన్చినపుడు ,లేదా బొట్లు బొట్లుగా పడి బాదిన్చినపుడు ఈ క్షారం 3gm మోతాదుగా ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగితే వెంటనే మూత్ర బిగింపు హరిన్చిపోయి మూత్రం ధారాళంగా వెలువడుతుంది.
స్త్రీల ప్రదర రోగము
అనబకాయ ముక్కలను యండ బెట్టి దంచి పొడి చేసి నిలువ వుంచుకోవాలి.ఈ చూర్ణము అర చెంచా నుంచి ఒక చెంచా మోతాదుగా బియ్యం కడిగిన నీటితో గాని లేక తేనెతో గాని కలిపి 2 పూటలా తాగుతూ వుంటే స్త్రీల బట్టంటు రోగాలు తగ్గిపోతాయి.
వేసవి పగుళ్ళు
అనబ కాయ లోని పప్పును మెత్తగా నూరి పగుళ్ళ మీద లేపనం చేస్తూ వుంటే వేసవి పగుళ్ళు హరించి పోతాయి.
స్త్రీల రక్తస్రావము
అనబ కాయ మీద బెరడు ,తెల్ల బియ్యం కలిపి నీటితో మెత్తగా నూరి మూత్రద్వారము వద్ద లేపనము చేస్తూ వుంటే స్త్రీల అతి రక్తం కట్టుకుంటుంది.



 

అందమునకు ఆయుర్వేదము


నెరసిన వెంట్రుకలు నల్లబడుటకు
కరక్కాయ ,తానికాయ ,ఉసిరికాయ ఈ మూడింటి బెరడు ,నీలి ఆకు ,లోహా చూర్ణము వీటిని సమబాగాలుగా గుంటగలగర నిజరసము జీలకర్ర రసము గొర్రె మూత్రము కలిపి మెత్తగా దంచి రోజు ఉదయం లేక సాయంత్రము తలకు రాసుకుని దట్టముగా లేపనం చేసి 2,3 గంటల తరువాత కుంకుడు శికకాయలతో తలస్నానము చేసిన తెల్లవెంట్రుకలు క్రమంగా తగ్గి పోతాయి.

శరీరము బిగువుగా ఉండుటకు
మేడి పాలు ,మర్రి పాలు నువ్వుల నూనె తో కలిపి కాచి శేరీరానికి మర్దన చేసుకోవాలి.

వెంట్రుకలు ఊడకుండా ఉండుటకు
మినుములు ,మెంతులు ,ఉసిరిక సమంగా తీసుకుని నానబెట్టి రుబ్బి తలకు పెట్టవలెను.ఆరిన తరువాత కుంకుడు రసం తో స్నానం చేయవలెను అలా చేసిన తరువాత 3 రోజుల్లోనే అద్బుత ఫలితం కలుగుతుంది.

అతి బరువు
తులసి ఆకులను పెరుగు లేక మజ్జిగతో వాడిన బరువు తగ్గును.

పులిపిర్లు తగ్గుటకు
ఉత్తరేని ఆకు ,హరిచంధనమును నువ్వుల నూనె తో కలిపి మెత్తగా నూరి పులిపిర్ల పై లేపనం చేయవలెను.

అధిక మాంసం తగ్గుటకు
ఆవనూనెతో మర్దనా చేస్తే అధిక మాంసం తగ్గుతుంది(ex:మోకాలి క్రింద బాగాన..)

జుట్టు తిరుగుటకు
రాత్రి పడుకోబోయే ముందు తలకు ఆముదము రాసి జుట్టును పక్కకు దువ్వాలి ఇలా కొన్ని రోజులు చేసిన తరువాత పక్కకు తిరిగిన జుట్టును వెనుకకు కూడా దువ్వుకొన వచ్చును.కుంకుడు రసం తోనే తలస్నానం చేయాలి షాంపూ ,సబ్బులు వాడకూడదు.

చుండ్రు
90 వేపాకులు ,9 మిరియాలు కలిపి కొంచెం నీళ్ళు కలిపి మెత్తగా నూరి తలకు ఒంటికి పట్టించుకవాలి సరిపోక పోతే మరికొంత కలుపుకోవచు.ఆరిపోగానే కుంకుడు కాయ రసం తో స్నానం చేయవలెను.వేపాకులు మిరియాల సంక్య కరెక్ట్ గా వుండాలి.

నల్ల మచ్చలు పోవుటకు
ఆముదపు గింజలు 225 తీసుకుని పై పెచ్చులు తీసివేసి ,లోపలి పప్పులో 12gm శొంటి పొడి కలిపి మెత్తగా నూరి ,కుంకుడు గిన్జలంత టాబ్లెట్స్ చేసి ,నిలువ ఉంచుకుని పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల మంచి నీళ్ళతో వేసుకుంటూ వుంటే 2,3 నెలల్లో నల్ల మచ్చలన్ని నామరూపాల్లేకుండా పొతాయ్.

మొటిమలు
[1].సుగంధి పాల వేళ్ళ బెరడు చూర్ణము ,పెసర పిండి ,హారతి కర్పూరము ఈ 3 సమబాగాలుగా కలిపి ఈ చూర్ణముతో ముకానికి నలుగు పెట్టుకుంటూ వుంటే ,ముకం మీద మొటిమలు ,మచ్చలు హరిన్చిపోతాయ్.

[2].సుగంధపాల వేళ్ళ చూర్ణము వస చూర్ణము ధనియాల చూర్ణము ఈ మూడింటిని సమ బాగాలుగా కలిపి నీటితో మెత్తగా నూరి ముకానికి రాస్తూ వుంటే మొటిమలు మచ్చలు హరించి పొతాయ్.

తల లోని పేలు
సుగంధ పాల వేళ్ళను గో మూత్రములో కలిపి మెత్తగా నూరి తలకు లేపనం చేస్తూ వుంటే తల లోని పేలు హరించి పొతాయ్.

వళ్ళు తగ్గటానికి
వాన నీటిని ఆకాశం నుండి పడేటప్పుడు నెల మేధా పడకుండా పట్టుకుని నిలువ వుంచి రోజు ఉదయం పూట 50gm వాన నీటిలో చిటికెడు మంచి పసుపు కలిపి తాగుతూ వుంటే 3 నెలల్లో స్థూలశరీరం తగ్గిపోతుంది.


 
బెల్లం , ఉప్పు తో ఆయుర్వేదం

ఏ బెల్లం మంచిది
కొత్త బెల్లం ఏ విధంగా మంచిది కాదు.దాన్ని తినటం వల్ల కడుపులో పురుగులు పుట్టుకోస్తై .మలబధకం కలుగ చేస్తుంది.ఎక్కువ మూత్రం విసర్జిమ్పజేస్తుంది.శ్వాసకోశ వ్యాధులను కూడా కల్గిస్తుంది.
పాత బెల్లం అంటే కనీసం ఒక సంవత్సరం పాటు నిలువ వున్న బెల్లం ఎంతో ఉతమమైనది.దానిని వాడటం వల్ల సర్వ రోగాలు తాపాలు జ్వరాలు హరించి పోతాయి.నోటికి రుచి పెంచి జీర్ణ శక్తిని కలిగిస్తుంది.పండు రోగం ప్రమేహా రోగాలలో బెల్లం అమోగంగా పనిచేస్తుంది.
వాంతులు
బెల్లము జీలకర్ర సమంగా కలిపి దంచి ఉసిరికాయంత ఉండలు చేసి రోజూ 4,5 సార్లు ఒక్కొక్క ఉండ తింటూ వుంటే వాంతులు కట్టుకుంటై.
తెలు కాటుకు
బెల్లం గంజాయి ఆకు కలిపి నీలతో నూరి ఆ ముద్దను తెలు కుట్టిన చోట పట్టిస్తే విషం పైకి ఎక్కకుండా ఆగిపోయి బాధ కొద్ది సేపట్లోనే తగ్గిపోతుంది.
ఎలుక విషానికి
బెల్లం ,నువ్వుల నూనె ,జిల్లేడు పాలు కలిపి మెత్తగా నూరి చేతి గోళ్ళకు లేపనం చేస్తే ఎలుక విషం విరిగి పోతుంది(పై పూతకు మాత్రమే).
నీళ్ళ విరేచానములకు
బెల్లం ఆవాలు సమబాగాలుగా తీసుకుని మేతగా నూరి ,బట్టాని గిన్జలంత మాత్రలు చేసి ,పూటకు ఒక మాత్ర చొప్పున మంచి నీళ్ళతో 3 పూటలా వేసుకుంటూ వుంటే నెల్ల విరేచనాలు తగ్గిపోతాయి.
అల్సర్
పాత బెల్లం ,అల్లం ,నువ్వులు సమంగా దంచి పూటకు ఉసిరికాయంత ముద్ద కొద్ది కొద్దిగా తింటూ ఉంటే అల్సర్ తగ్గుతుంది.
అందమైన ఆరోగ్యం
ఆవు పెరుగులో మంచి పాత బెల్లం కలుపుకుని రోజు తింటూవుంటే మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
విషమ జ్వరాలకు
బెల్లం 20gm లు తీసుకుని దానిలో జీలకర్ర చూర్ణం గాని ,వాము చూర్ణం గాని ,కొంచెం దోరగా వేయిన్చి కలిపి దంచి పూటకు ఒక మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గి పోతాయి.
తలనొప్పికి
బెల్లము ,శొంటి సమంగా కలిపి దంచి ఆ ముద్దను మాటిమాటికి వాసన చూస్తూ వుంటే తలనొప్పి తగ్గిపోతుంది .
పార్శ్వపు తలనొప్పి
పాత బెల్లం 24gm ,కర్పూరం 2gm కలిపి మెత్తగా నూరి ప్రతి రోజు ఉదయం పూట ఒక మోతాదుగా తింటూ వుంటే పార్శ్వపు తల నొప్పి తగ్గి పోతుంది.
బోదకాలు
పాతబెల్లం ,మంచి పసుపు సమంగా కలిపి నూరి పూటకు 10gm ,మోతాదుగా 30gm గోమూత్రములో కలుపుకుని 2 పూటల తాగుతూ వుంటే క్రమంగా బోదకాలు ,కుష్టు ,అతి దాహము తగ్గిపోతాయి.
కీళ్ళ నొప్పులకు
బెల్లము శుద్ధి చేసిన గుగ్గిలము ,ఈ రెండు సమాన బాగాలుగా కలిపి దంచి రేగి పండంత మాత్రలు ఆరబెట్టి నిలువ చేసుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు చీల మండల నొప్పులు మెడిమల నొప్పులు తగ్గిపోతాయి.
అన్ని రకాల ముక్కు రోగాలు
బెల్లం 280gm ,శొంటి 30gm ,పిప్పళ్ళు 30 gm , యాలకులు 30gm తీసుకుని అన్ని కలిపి దంచి పూటకు చిన్న ఉసిరికాయలంత మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే అన్ని రకాల ముక్కు రోగాలు తప్పకుండా పోతాయి.
వాత సంబంధ గొంతు బొంగురు
బెల్లము ,నెయ్యి సమంగా కలిపి 2 పూటలా కొద్ది కొద్దిగా తింటూ వుంటే గొంతు బొంగురు తగ్గి గొంతు బాగుపడుతుంది.
బెల్లం పాకం పట్టి అందులో దోరగా వేపిన మిరియాల చూర్ణం కలిపి నిలువ ఉంచుకుని రోజు పూటకు 5 gm మోతాదుగా తింటూ వుంటే గొంతుబొంగురు తగ్గుతుంది.
అరికాళ్ళు అర చేతుల్లో పొరలు ఊడుతుంటే
బెల్లం అల్లం సమంగా కలిపి నూరి పూటకు 5 నుండి 10gm మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే అరికాళ్ళు అర చేతుల్లో పొరలు ఊడటం తగ్గిపోతుంది.
ధద్దుర్లకు
బెల్లం ,వాము సమబాగాలుగా కలిపి దంచి ,రేగి పండ్లనత టాబ్లెట్స్ చేసి నిలువ ఉంచుకుని పూటకు ఒక మాత్ర చొప్పున 2 లేక 3 పూటల ఆవ నూనెలో ముంచుకుని తింటూ వుంటే దద్దుర్లు హరిన్చిపోతై.

కనబడని దెబ్బల నొప్పులకు
పాత బెల్లం చిక్కగా పాకం కాచి అందులో తగినంత నెయ్యి కలిపి పూటకు 100gm చొప్పున 2 పూటల సేవిస్తో వుంటే కవుకు దెబ్బలు నొప్పులు హరించి పోతాయి.
పుండ్లు-వ్రాణాలకు
పాత బెల్లం ,పొంగించిన వేలిగారం ఈ రెండు సమంగా కలిపి నూరి పుండ్ల మీద ,వ్రణాల మీద లేపనం చేస్తూ ఉంటే తగ్గిపోతాయి.
మూత్రం బిగిస్తే
గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం పాత కలిపి తాగుతూ వుంటే మూత్రబిగింపు తగ్గిపోతుంది.బెల్లం ,జీలకర్ర కలిపి తింటూవున్న తగ్గిపోతుంది.


ఉప్పు

సాధారణ పాముకాటుకు
బురద పాము లేదా తుట్టె పురుగు లేదా మామూలు పాములు కరచినప్పుడు ,కరచిన చోట కత్తితో కొద్దిగా గీరి రక్తము పిండి ఉప్పు సున్నము కలిపి నూరిన ముద్దను కాటుపై మర్దించిన యెడల విషము దిగును.
కలరా వ్యాధికి
ఉప్పు ,మిరియాలు ,జిల్లేడు పూవులు సమబాగాలు తీసుకుని కలిపి మెత్తగా నూరి బట్టని గిన్జలంత టాబ్లెట్స్ చేసి గంటకు ఒక టాబ్లెట్ చొప్పున 5,6 మాత్రలు వేసుకుంటే కలరా హరించిపోతుంది.
దెబ్బల వాపులకు
ఉప్పు ,వెల్లుల్లి పాయలు సమబాగంగా తీసుకుని మెత్తగా దంచి ఆ ముద్దను వాపు మీద వేసి కడుతూ వుంటే 2 కట్ల లోనే వాపు తగ్గి పోతుంది.
అధిక పైత్యమునకు
ఉప్పు ,చింతపండు ,మిరియాలు ,శీకాయ చెట్టు చిగురాకులు కలిపి వచ్చి పచడిలాగా నూరి ,ఆ పచ్చడిని అన్నంలో కలుపుకుని తింటూ ఉంటె అదికపైత్యం హరించిపోతుంది.
ఆకలి-అజీర్ణం
ఉప్పు ,శొంటి సమబాగాలుగా తీసుకుని కొంచెం దోరగా వేయించి దంచి పొడి చేసుకుని బోజన సమయంలో మొదటి ముద్దలో 5gm పొడి కలిపి తింటూ వుంటే నాలుక ,గొంతు శుబ్రమై కఫము తగ్గి ,ఆకలి పెరిగి ,ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
కడుపు నొప్పి
ఒక గ్లాస్ నీళ్ళల్లో 1 స్పూన్ సోడా ఉప్పు కలిపి తాగితే మంత్రిన్చినట్లుగా కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది.
చలి జ్వరం
ఉప్పు ,మిరియాలు ,పిప్పిన్టాకు(మార్కొన్డాకు) ఈ 3 సమంగా కలిపి కచాపచాగా నలగగొట్టి గుడ్డలో వేసి మూటగట్టి దాని వాసన పదే పదే చూస్తూ వుంటే చలి జ్వరం రాకుండా వుంటుంది.
చిన్న పిల్లల కడుపు నొప్పి
నల్ల ఉప్పు 10gm ,నిప్పుల మీద వేసి పొంగించిన వెలి గారము 5gm ఈ రెండు సమంగా కలిపి మెత్తగా నూరి 2 పూటల పూటకు చిటికెడు మోతాదుగా నీటిలో కలిపి తాగిస్తూ వుంటే పిల్లల కడుపునొప్పి తగ్గుతుంది.
తల నొప్పులకు
తినే ఉప్పు ,పాతిక బెల్లం ఈ రెండూ సమంగా కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని 2 పూటల 2 gm పొడిని గోరువేచని నీటిలో వేసుకుని తాగుతూ వుంటే తలనొప్పులు తగ్గి పోతాయి.
పిల్లల ఉదర వ్యాధులు
నల్ల ఉప్పు సోంపు గింజలు సమంగా తీసుకుని మెత్తగా దంచి నిలవచేసుకుని ,రోజు 2 పూటలా ఒక గ్రాము పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగిస్తూ వుంటే పిల్లల ఉదర సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి.
స్త్రీల హిస్టీరియా
నల్ల ఉప్పు 10 gm ,తినే ఉప్పు 10gm ,ఇంగువ 3gm , సైంధవ లవణం 10gm , నూరే కారం 10 gm ,పిప్పళ్ళు 10gm ,శొంటి 10gm , ఆవాలు 10gm ,ఇవన్ని కలిపి చూర్ణం చేసి కొద్దిగా నిమ్మ పండ్ల రసం తో మర్దించి నిలువ చేసుకోవాలి .రోజు 2 పూటల పాటకు 3gm మోతాదుగా వేడి నీళ్ళతో సేవిస్తూ వుంటే స్త్రీ ల హిస్టీరియా నశించి పోతుంది.
చెవిలో పురుగు దూరితే
చెవిలో పురుగు దూరితే ఉప్పు ,వేపాకు కలిపి దంచిన రసము 4 చుక్కలు చెవిలో వేస్తే వెంటనే క్షణాలలో పురుగు బయటకు వస్తుంది.
ఫిట్స్ వచ్చినపుడు
ఉప్పును నీటిలో వేసి కరిగించి వడపోసి ఆ ఉప్పు నీటిని 3 ,4 చుక్కలు ముక్కులో వేస్తే ఫిట్స్ వల్ల అపస్మారము వల్ల తెలివి తప్పిన వారు వెంటనే కోలుకుంటారు.
వాపులకు-నొప్పులకు
ఉప్పును వేయించి మూట గట్టి దానితో కాపడం పెడుతూ వుంటే వాపులు ,నొప్పులు వెంటనే తగ్గుతాయి.కడుపు నొప్పికి ,గుండె నొప్పికి ఇదే విధంగా కాపడం పెట్టడం ద్వారా నొప్పులు నెమ్మదిస్తై.

 

తాంబూలం(పాన్,కిల్లి) రహస్యాలు


ఆహారము సేవించిన తరువాత తాంబూలము సేవించుట మంచిది ,ఆరోగ్యకరమైనది.తాంబూలము సేవించిన మనము తీసుకున్న ఆహారమునందలి విష పదార్ధములను నిర్వీర్యము చేయును.
జీర్ణ శక్తిని అబివృద్ధి పరచును.తాంబూలము సేవించుట వలన జీర్ణ శక్తి అబివృద్ధి పరచును ,ధన్తపుష్టి కలుగును. ఎప్పటికి చెడుపు కలుగనీయదు.తాంబూలము నోటికి చురుకుదనము ,సువాసనను ఇచ్చును ,ముకమునకు కాంతి కల్గును . స్వరాపెటికా ,నాలిక ,దంతములు ,వీటియందు మలినము పోగొట్టును .అధికముగా నోటి యందు ఉమ్ము రావుటను తగ్గించును.
హృదయమునకు మేలు చేయును.ఉష్ణమును కలుగ చేయును.కారము చేదు ఉప్పు వగరు రసములను కలిగి యుండుటచే మలబధకమును పోగొట్టును.
సంబోగామునందు ఆసక్తి కల్గించును.కొన్ని సమయములందు పిత్తమును వృద్ధి చేయును. ఆరోగ్యజీవేతము ,ధరానా శక్తి , జ్ఞాపక శక్తి ,బుద్ధి ఆకలి కల్గించును .

No comments: