Showing posts with label TELUGU. Show all posts
Showing posts with label TELUGU. Show all posts

Sunday, February 27, 2011

శతక సాహిత్యం

శతక సాహిత్యం................  click here

Friday, February 25, 2011

వేమన పద్యాలు

వేమన సూక్తి ముత్కావళి

1) అగ్నిచేతబట్టి యా పరమేశుని
నిమ్దచేసి నరులు నీరుకారె?
దక్షు క్రతవులోని తల్లడమెఋఉగరా?
విశ్వదాభిరామ వినురవేమ.

2) అమ్తరమ్గమమ్దు నపరాధములు చేసి
మమ్చివానివలెనె మనుజుడుమ్డు
ఇతరు లెఋఉగకున్న నీశ్వరుడెఋఉగడా?
విశ్వదాభిరామ వినురవేమ.

Wednesday, September 15, 2010

సామెతలు

అంగడి అమ్మి, గొంగళి కొన్నట్లు.

అంచు డాబే గానీ, పంచె డాబు గాదు.

అంధునకు అద్దము చూపినట్లు.

అంకె లేని కోతి లంకంతా చెరచిందట.

అంగట్లో అన్నీ ఉన్నా - అల్లుడి నోట్లో శని వుంది

గురువులకిదే మా వందనం

చదువు నేర్పే గురులకిదె మా వందనం

జ్ఞాన దాతల చరనధూళికి వందనం

శాంతమూర్తులు స్వచ్చకీర్తులు

సుజన చంద్రులు - సుగుణసాంద్రులు

గురులు - సుతరులు || చదువు ||

తెలుగు పతాక గీతం

తెలుగు పతాకమా...

మా జాతి పతాకమా...

ఎగరవేస్తాం మళ్ళీ పైపైకీ

మా గుండెల ఊపిరి పోసే ||తెలుగు||

దేశభాషలందు తెలుగు లెస్స

ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి

అమ్మపాట పాడినట్టి భాష

తేనె వంటి మందు వీనులకును విందు

దేశభాషలందు తెలుగులెస్స!

మా తెలుగు తల్లికి

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

మా కన్న తల్లికి మంగళారతులు

కడుపులో బంగారు కనుచూపులో కరుణ

చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి

ఝండా ఊంఛా రహే హమారా

విజయీ విశ్వతిరంగా ప్యారా

ఝండా ఊంఛా రహే హమారా ||ఝండా||


సదా శక్తి బర్సానే వాలా

ప్రేమ సుధా సర్సానే వాలా

వీరోంకో హర్షానే వాలా

మాతృభూమికా తన్ మన్ సారా ||ఝండా||

తేనెల తేటల మాటలతో

తేనెలతేటల మాటలతో

మనదేసమాతనే కొలిచెదమా

భావం, భాష్యం చూసుకొని

సుఖజీవనయానం చేయుదమా ||తేనెల||

Saturday, January 30, 2010

రాఖీ

అ- అన్నా చెల్లెళ్ల బంధానికి నెలవిది

ఆ- ఆప్యాయంగా అందరూ కలిసే రోజిది

ఇ- ఇరవై ఒకటో శతాబ్దంలోనూ మరువనిది

ఈ- ఈమెయిల్స్ గాను పంపే విషయమిది

ఉ- ఉత్తర,దక్షిణ భారతదేశాల్లో జరుపుకొనేది

ఊ- ఊకదంపుడు విషయం కాదిది

ఋ- ఋతువులెన్ని వచ్చినా

ఎ- ఎన్నడూ మరివనిది

ఏ- ఏ మనిషినైనా మైమరపించేది

ఐ- ఐదుగురు అన్నలున్నా

ఒ-ఒక్క సోదరి లేకుంటే

ఓ- ఓ సోదరుడా నీకు లేదు రాఖీ

ఔ-ఔరా అని నీ మనసును కలచివేస్తుంది

అం- అందరి మన్ననలు పొందిన రాఖీ

అః- అః అని అందరి చేత అన్పిస్తుంది రాఖీ
అన్నల మణికట్టుపై మెరుస్తుందీ రాఖీ.

ఉగాది

యుగం ప్రారంభమైన రోజే యుగాది. కాల క్రమంలో అదే ఉగాదిగా పరిణతి చెందింది.
కృత,త్రేతా,ద్వాపర,కలి యుగాలలో జరుపుకునే విశిష్ట,వైశిష్ట పర్వదినం ఈ ఉగాది. ప్రతీ యుగం లోను ఈ ఉగాది ఒక్కో రోజున జరుపుకునేవారు. కృత యుగంలో కార్తీక శుద్ద నవమి నాడు, త్రేతా యుగంలో వైశాఖ శుద్ద తదియ నాడు, ద్వాపర యుగంలో మాఘ శుద్ద పూర్ణిమ నాడు జరుపుకునేవారు. మరి ఇక కలి యుగంలో చైత్ర శుద్ద పాడ్యమి నాడు జరుపుకుంటున్నాం మనం.

ఉ- అంటే నక్షత్రం
గ -అంటే నడక
ఉగాది అంటే నక్షత్రాల నడక అని అర్దం.
అలా నక్షత్రాల నడకతో ఆరంభమైనది ఈ కాలగమనం. అలా ఏర్పడినది యుగం -యుగం.

ఒక్కో యుగంలో దైవాన్ని చేరడానికి ఒక్కో మార్గాన్ని అనుసరించే వారు. అలా ఈ కలియుగంలో కేవలం మంచి మాటలు వినినంతనే మోక్షం కలుగుతుంది. అందుకే ఈ ఉగాది రోజు తప్పకుండా పంచాంగం వినాలి అంటారు. కాల పురుషుని స్థితి గతులు, ఆతని భాధల నివారణోపాయాలు ఈ పంచాగ శ్రవణంలో మనకు లభ్యమవుతాయి. ఉగాది రోజున ఎలా ఉండునో జీవితం సంవత్సరమంతా అలానే ఉండునను కొందరి నమ్మకం.

హేమంత, శిశిరాలలో పెరిగిన బద్దకం ఉగాది రోజుతో అంతమవ్వాలని చేస్తాం తైల మర్దనం, తలంటి స్నానం. అంగ పరిరక్షణకు నూతన వస్త్రధారణం, అంతః సురక్షితకు దేవతార్చనం ఉగాది నాడు ఎంతో ముఖ్యం.

కఫ, వాత, పిత్తములే అనారోగ్యానికి ముఖ్య కారణం. వాటికి ఉంది ఒకే ఒక్క నివారణ మార్గం. అదే షడ్రుచుల సమ్మేళనం. దాని పేరే ఉగాది పచ్చడి.

ఉగాదికే వన్నె ఉగాది పచ్చడి
షడ్రుచుల మిళితం ఈ పచ్చడి
మానవ జీవితానికి మారురూపు ఈ పచ్చడి

తీపి అనే ఆనందం వెతుకులాటలో
చేదు అనే జ్ఞాపకంమిగిలితే
పులుపు అనే గుణపాఠంతో
వగరు అనే సలహాతో
నూతన జీవితానికి స్వాగతం
పలకాలనేదే ఈ ఉగాది వెనుక రహాస్యం.