Wednesday, September 15, 2010

గురువులకిదే మా వందనం

చదువు నేర్పే గురులకిదె మా వందనం

జ్ఞాన దాతల చరనధూళికి వందనం

శాంతమూర్తులు స్వచ్చకీర్తులు

సుజన చంద్రులు - సుగుణసాంద్రులు

గురులు - సుతరులు || చదువు ||


రామునికి - విలువిద్య నేర్పెను

మౌని విశ్వామిత్రుడు

కృష్ణునే చదివించే

సాందీప జ్ఞాని పవిత్రుడు

ఎంత ఘనులకునైన గాని

గురువులే ప్రత్యక్ష దేవులు || చదువు ||

రాధాకృష్ణులు - రామకృష్ణులు

విశ్వకవులు - వివేకానందులు

శంకరులు - వేదవ్యాసులు

ఎందరెందరో జగద్గురువులు || చదువు ||

కోటి సూర్యులున్న - కోటి చంద్రులున్న

గురువు మాట లేకుండా - ఎద చీకటి పోతుందా?

జ్ఞానజ్యోతి వెలిగించి మము ప్రగతికి నడిపించె

గురువే బ్రహ్మ గురువే విష్ణువు - గురువే మహేశ్వరుడు

ఆ త్రిమూత్రి రూపునకిదె వందనం

ఆ దరుంతరంగున కిదె వందనం || చదువు ||

No comments: