అంగడి అమ్మి, గొంగళి కొన్నట్లు.
అంచు డాబే గానీ, పంచె డాబు గాదు.
అంధునకు అద్దము చూపినట్లు.
అంకె లేని కోతి లంకంతా చెరచిందట.
అంగట్లో అన్నీ ఉన్నా - అల్లుడి నోట్లో శని వుంది
అంగట్లో అరువు - తలమీద బరువు లాంటిది
# అంగడిలో దొరకనిది - అమ్మ ఒక్కటే !
# అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకున్ఠం.
# అగ్నికి వాయువు తొడైనట్లు.
# అంచులేని గిన్నె - అదుపులేని పెళ్ళాం !
# అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత!
# అంతా మన మంచికే
# అంతా మావాళ్లేగాని - అన్నానికి రమ్మనేవాళ్లులేరు !
# అంత్య నిష్టూరంకన్నా - ఆది నిష్టూరం మేలు !
# అందని ద్రాక్షపండ్లు - పుల్లన!
# అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట.
# అందితే జుట్టు అందక పోతే కాళ్ళు.
# అందరూ ఎక్కేవాళ్ళయితే మోసేవాళ్ళెవరు!
# అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
# అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు.
# అడగందే అమ్మైనా అన్నం పెట్టదు.
# అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు.
# అప్పు చేసి పప్పు కూడు.
# అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి.
# అయ్యవచ్చే వరకు అమావాస్య ఆగుతుందా.
# అయ్యవారిని చెయ్యబోతే కోతి బొమ్మ అయినట్లు.
# అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
# అతి రహస్యం బట్టబయలు
# అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
# అనువు గాని చోట అధికులమనరాదు
# అభ్యాసం కూసు విద్య
# అజ్ఞానం అభివృద్ధికి అడ్డుగోడ
# అభ్యాసం ప్రారంభిస్తే అజ్ఞానం తెలుస్తుంది
# అదృష్టం సాహసవంతులనే వరిస్తుంది
# అదిగో పులి ఇదిగో తోక
# అమ్మ పుట్టిల్లు మేనమామకెరుకే
# అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి
# అత్యున్నతమైన ఆదర్శాన్ని ఎన్నుకుని దానికి తగ్గట్లుగా జీవించండి
# అడకత్తెరలో పోకచెక్క
# అహంకారం అజ్ఞానానికి అనుంగు బిడ్డ
# అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత పెరుగుతుంది
# అతి సర్వత్ర వర్జయేత్
# అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్ధించు! అన్నీ నీపైనె ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు!!
# అందరి సంతోషం లో నీ సంతొషాన్ని వెతుక్కో
# అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు బిడ్డలా?
# అజ్ఞానులు గతాన్ని, బుద్ధిమంతులు వర్తమానాన్ని, మూర్ఘులు భవిష్యత్తును మాట్లాడతారు
# అణకువ లేని అందం అసహ్యంగా ఉంటుంది
# అత్యున్నతమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్లుగా జీవించండి
# అవసరానికి మించి ఒక్కమాట కూడా అదనంగా మాట్లాడకండి
# అందరి పట్ల విధేయత కనబరచండి కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి
# అయితే ఆదివారం కాకుంటే సోమవారం
# ఆకుకు అందదు, పోకకు పొందదు.
# ఆచారం ముందర, అనాచారం వెనుక.
# ఆడే కాలు, పాడే నోరు ఊరికే ఉండదు.
# ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
# ఆ తాను ముక్కే !!!.
# ఆ మొద్దు లోదే ఈ పేడు.
# ఆయుష్షు లేక చస్తారు గానీ, ఔషదం లేక కాదు.
# ఆ ఊరి దొర ఈ ఊరికి తలారి !
# ఆకలికి అదుపు, ఇంటికి పొదుపు ఉండాలి!
# ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు
# ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు.
# ఆకారం ఉంటే శ్రీకారం ఉండదు !
# ఆకాశానికి హద్దే లేదు.
# ఆటా పాటా మా ఇంట మాపటి భోజనం మీ ఇంట !
# ఆచరణ తక్కువ! ఆర్భాటం ఎక్కువ!
# ఆడది తల్లి అదుపున - మగవాడు తండ్రి అదుపున పెరగాలి.
# ఆడది తిరిగి చెడు ! మగవాడు తిరగక చెడు !
# ఆత్రానికి బుద్ధి మట్టు.
# ఆడబోయిన తీర్థము యెదురైనట్లు.
# ఆడలేక మద్దెల వోడు అన్నట్లు.
# ఆడది మేడిపండు లాంటిది.
# ఆడవారి మాటలకు అర్దాలే వేరులే.
# ఆడింది ఆట పాడింది పాట.
# ఆడే కాలు, పాడే నోరు ఊరికే ఉండదు.
# ఆదిలోనే హంస పాదు.
# ఆనందమే బ్రహ్మానందం.
# ఆపదలైనా సంపదలైనా ఒంటరిగా రావు.
# ఆయుష్షు లేక చస్తారు గానీ, ఔషదం లేక కాదు.
# ఆరాటమే గాని పోరాటం లేదు.
# ఆరే దీపానికి వెలుగు యెక్కువ.
# ఆరోగ్యమే మహాభాగ్యము.
# ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?.
# ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట.
# ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం.
# ఆలోచించి మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత ఆలోచించకూడదు
# ఆర్నెల్లు కర్రసాము నేర్చి మూలనున్న ముసలవ్వపై ప్రతాపం చూపాట్ట...
# ఆలస్యం అమృతం విషం.
# ఆవలిస్తే పేగులు లెక్కపెడతారు
# ఆడితప్పరాదు పలికి బొంకరాదు
# ఆశకు అంతు లేదు; నిద్రకు సుఖం లేదు.
# ఇంట గెలిచి రచ్చ గెలువు.
# ఇంటి కన్నా గుడి పదిలం.
# ఇంటి కళ ఇల్లాలే చెబుతుంది.
# ఇంటి గుట్టు లంకకు చేటు.
# ఇంటి గుట్టు, పెరుమాళ్ళ కెరుక.
# ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.
# ఇంటికి అవ్వ అవసరం కొలతకు తవ్వ అవరం.
# ఇంటికి దీపం ఇల్లాలు.
# ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి.
# ఇంటిలోని పోరు ఇంతింత కాదయ.
# ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు.
# ఇంటికన్న గుడి పదిలం.
# ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత.
# ఇంట్లో దేవుణ్ణి వదిలి వీధిలో దేవుణ్ణి మొక్కినట్లు.
# ఇంట్లో పిల్లి వీధిలో పులి.
# ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్లు.
# ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు.
# ఇల్లు పీకి పందిరేసినట్టు
# ఇచ్చేవాడు తీసుకునేవాడికి లోకువ.
# ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లు.
# ఇనుము విరిగితే అతకవచ్చు, మనసు విరిగితే అతకలేము.
# ఇరుగు చల్లన పొరుగు చల్లన.
# ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు, కొమ్ము బర్రె కొట్టానికి చేటు.
# ఇల్లలకగానే పండుగా?
# ఇల్లిరికం కన్నా మూలరికం మిన్న.
# ఇల్లు చూచి ఇల్లాలిని చూడు.
# ఇష్టం కానిదే కష్టం.
# ఇస్తే వరం పెడితే శాపం.
# ఇసుక తక్కెడ పేడ తక్కెడ.
# ఈ సంబరానికేనా ఇంత ఊరింపు.
# ఈగూటి చిలుకకు ఆగూటిపలుకే వస్తుంది.
# ఈచేత చేసి ఆచేత అనుభవించినట్లు.
# ఈటె పోటు మానుతుంది కాని మాట పోటు మానదు.
# ఈడుచూసి పిల్లనివ్వాలి , పిడి చూసి కొడవలికొనాలి.
# ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగినట్టు.
# ఈతకు మించిన లోతే లేదు.
# ఈతచెట్టు కింద పాలు తాగినా కల్లే అంటారు.
# ఈదగల వానికి లోతు లేదు.
# ఈనాడు ఇంట్లో రేపు మంట్లో.
# ఈనిన పిల్లికి ఇల్లు వాకిలీ తెలియనంత ఆకలి.
# ఈవేళ పని రేపటికి వాయిదా వేయకు.
# ఈశ్యానం పొయ్యి పెడితే అన్నం పుట్టదు.
# ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి.
# ఉండనిస్తే పండుతుంది, ఊడనిస్తే ఎండుతుంది.
# ఉండి చూడు ఊరు అందం, నానాటికి చూడు నా అందం.
# ఉట్టి కెగరలేనమ్మ స్వర్గాని కెగిరినట్లు.
# ఉడుముకు రెండు నాలుకలు.
# ఉత్తర చూచి ఎత్తర గంప.
# ఉదాయాన్నే వచ్చిన చట్టం ఉదాయాన్నే వచ్చిన వాన ఉండవు.
# ఉన్న ఊరు తల్లి వంటిది.
# ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ.
# ఉన్నమాట చెపితే, వూరు అచ్చిరాదు.
# ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టి లేనమ్మ లేనమ్మకే పెట్టినట్లు.
# ఉన్నవాడు వూరికి పెద్ద, చచ్చినవాడు కాటిక పెద్ద.
# ఉపాయం ఎరుగనివాణ్ణి వూళ్ళో వుండ నివ్వకూడదు.
# ఉపకారానికి పోతే అపకారమెదురైనట్లు.
# ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు.
# ఉప్పు లేని కూర పప్పు లేని అన్నం పనికిరాదు.
# ఉమ్మడి బేరం, ఉమ్మడి సేద్యం ఇద్దరికీ చేటు.
# ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లు.
# ఉత్సాహం క్రియాశీలతను వెయ్యి రెట్లు పెంచుతుంది
# ఉల్లి చేసిన మేలు తల్లి కూడ చేయదు.
# ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బతకవచ్చు.
# ఊర పిచుక మీద తాటి కాయ పడినట్లు.
# ఊరికి వచ్చినమ్మ నీరుకు రాదా?
# ఊరే చేరవద్దు రౌతా అంటే, గుర్రాన్ని ఎక్కడకట్టేది అన్నాడట.
# ఊసరవల్లి వలె రంగులు మార్చేవాడు.
# ఊహించ లేనిదే జీవితం.
# ఊరంతా వడ్లు ఎండబెట్టు కొంటె, నక్క తోక యెండబెట్టు కొన్నదంట.
# ఊరంతా చుట్టాలు ఉట్టికట్ట తావు లేదు.
# ఊరు మొహం గోడలు చెపుతాయి.
# ఊరకుండటం కంటే, ఊయలూగటమే మేలు.
# ఊరక రారు మహానుభావులు.
# ఊరుకోవడమంత ఉత్తమం, బోడి గుండంత సుఖం లేదు.
# ఋణశేషము, అగ్నిశేషము, వ్రణశేషము, శత్రుశేషం వుంచకూడదు.
# ఎంచబోతే మంచమంతా కంతలే.
# ఎద్దు పుండు కాకికి ముద్దా?
# ఎంత ప్రాప్తమో, అంత ఫలము.
# ఎక్కడకడితే నేమి మనమందలో ఈనితేసరి.
# ఎక్కడికెళుతున్నావు విధవమ్మా అంటే వెంట వస్తున్నాను పదవమ్మా అన్నదంట.
# ఎక్కడి నీరూ పల్లానికే చేరుతుంది.
# ఎప్పటి మేలు అప్పటికే.
# ఎన్ని పుటాలేసినా ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే.
# ఎంత వెలుగుకు అంత చీకటి.
# ఎంత సంపదో అంత ఆపద ఎవరికివారు ఎమునా తీరు.
# ఎనుబోతు మీద వాన కురిసినట్టు
# ఎక్కువ వెల బెట్టి గుడ్డను, తక్కువ వెల బెట్టి గొడ్డును కొనరాదు.
# ఎవరికి వారే యమునా తీరే.
# ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.
# ఎలుక ఎంత ఏడ్చినా, పిల్లి కనికరిస్తుందా?
# ఏ ఎండకాగొడుగు.
# ఏ పుట్టలో ఏ పామో ఏ గుళ్ళో ఏ మహత్యమో.
# ఏటి ఈతకు లంక మేతకు సరి.
# ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహావృక్షము.
# ఏడిచేదాని మొగుడొస్తే నామొగుడూ వస్తాడు.
# ఏనుగు బతికినా వెయ్యి వరహాలే చచ్చినా వెయ్యి వరహాలే.
# ఏనుగు మీద దోమవాలినట్లు.
# ఏరు ఎన్ని వంకలు పోయినా సముద్రంలోనే పడాలి.
# ఏటికి ఎదురీదినట్లు.
# ఏనుగుకు కాలు విరగడమూ, దోమకు రెక్క విరగడమూ ఒక్కటే.
# ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు.
# ఏకై వచ్చి మేకై దిగబడ్డాడు
# ఏ గాలికి ఆ చాప ఎత్తాలి
# ఐక మత్యమే మహాబలము.
# ఐశ్వర్యానికి అంతములేదు.
# ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు.
# ఒంటికంటే జంట మేలు.
# ఒక అబద్దము కప్పడానికి వెయ్యి అబద్దాలు.
# ఒక్కొక్కరాయి తీస్తూ వుంటే కొండైనా కరిగిపోతుంది.
# ఒకడి సంపాదన పదిమందిపాలు.
# ఒక వరలో రెండు కత్తులు ఇమడవు.
# ఒక్క సిరా చుక్క లక్షల మొదళ్లకు కదలిక
కంటికి ఇంపయితే కంచానికీ ఇంపు.
కందకి లేని దురద కత్తిపీటకా.
కందెన వేయని బండికి కావలసినంత సంగీతం
కట్టిన ఇంటికి వంకలు చెప్పేవారు వెయ్యిమంది.
కట్టిన వాడికి ఒక ఇల్లు అయితే కట్టని వాడికి వంద ఇళ్లు.
కట్టిన వారు ఒకరైతే కాపురం చేసేవారు మరొకరు.
కట్టె వంక పొయ్యి తీరుస్తున్నది.
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ.
కడుపు నిండిన బేరము.
కడుపుతో ఉన్నమ్మ కనక మానుతుందా...వొండుకున్నమ్మ తినక మానుతుందా.
కడుపులోని మాట అంటే ఊరంతా పాకుతుంది.
కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు.
కత్తి తీసి కంపలో వేసి ఏకుతో పొడుచుకున్నట్లు.
కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు
కత్తి పదునా? కలం పదునా?
కథకు కాళ్ళూ ముంతకు చెవులు లేవు.
కధ కంచికి మనం ఇంటికి.
కననిది బిడ్డా కాదు. కట్టనిది చీరా కాదు.
కనుక్కొని రారా అంటే కాల్చి వచ్చాడు.
కన్ను యెర్రనయినా మిన్ను యెర్రనయినా కారక మానదు.
కర్రి కుక్క కపిల గోవు అవునా.
కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం.
కలకాలపు దొంగ ఒకనాడు దొరుకుతాడు.
కలిగినయ్య కలిగినయ్యకే పెట్టును, లేనయ్య కలిగినయ్యకే పెట్టును.
కలిమిలేములు కావడి కుండలు.
కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాదు.
కల్పవృక్షం క్రింద గచ్చపొద వున్నట్లు.
కరువులో అధికమాసం
కల్లా కపటం లేని వారికి కష్టాలు.
కష్టసుఖాలు కావటి కుండలు.
కాకిలా కలకాలం కాక హంసలా ఆరునెలలు బతికితే చాలు
కబుర్లతో కడుపు నిండదు
కాకి గూటిలో కోకిల పిల్ల వలె.
కాకి పిల్ల కాకికి ముద్దు.
కాకి పుట్టి నలుపే, పెరిగీ నలుపే.
కాకి ముక్కుకు దొండపండు.
కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు.
కాటికి పోయినా కరణాన్ని నమ్మరాదు.
కాయ తీగకు బరువు కాదు.
కాయని కడుపు పూయని చెట్టు.
కారణము లేకనే కార్యము పుట్టదు.
కాలం ఎంతో విలువైనది.
కాలమొక్క రీతిని గడపవలెను.
కాలయాపన కంటే నేరం లేదు.
కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి.
కాలుగాలిన పిల్లిలా తిరిగినట్లు.
కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత.
కాసుకు గతి లేదు, కోటికి కన్నేసినాడు.
కుంపట్లో తామర మొలిచినట్లు.
కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్లు.
కుక్కకాటుకు చెప్పుదెబ్బ.
కుడి చెంప కొడితే ఎడమ చెంప చూపించు.
కుప్ప తగులబెట్టి పేలాలు వేయించుకొనేవాడు.
కుంచం అంత కూతురు ఉంటే మంచం మీదే కూడు.
కుమ్మరి లేకుండా కుండ పుట్టునా.
కుక్క కాటుకు చెప్పుదెబ్బ
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు.
కుల మెరిగి చుట్టము, స్థలమెరిగి వాసము.
కులం కన్నా గుణం ప్రధానం.
కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది.
కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా.
కీడించి మేలించాలి!
కూటికి పేదయితే కులానికి పేదా.
కూడు గుడ్డా అడగకపోతే, బిడ్డను సాకినట్లు సాకుతాను అన్నాడు.
కూర్చుండి తింటూ వుంటే, కొండ కూడా సమసిపోతుంది.
కాసుంటే మార్గముంటుంది.
కూర్చుని తింటే కొండలయినా కరిగిపోతాయి
కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెరిపినది.
కొంత తెలుసుకోవడం తేలికే...అంతా తెలుసుకోవడమే కష్టం
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక కాస్తా ఊడిపోయిందట.
కొండంత దూదికి కొండంత నిప్పు ఏల.
కొండను తవ్వి యెలుకను పట్టినట్లు.
కీడెంచి మేలెంచమన్నారు.
కొండను మింగేవానికి గోపురం ఒక లెక్కా?
కొన్న దగ్గిర కొసరు గాని కోరిన దగ్గర కొసరా.
కొరివితో తలగోక్కున్నట్లు.
కోతి పుండు బ్రహ్మాండం.
కోటి విద్యలు కూటి కొరకే.
కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు.
కోడికి కోపమొచ్చి ఉన్న ఈకలు పీక్కుందట
క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము.
కుడుము చేతికిస్తే పండగ అనేవాడు.
కోతికి తేలుకుట్టినట్లు.
కృషితో నాస్తి దుర్భిక్షం.
కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు.
కోపము పాపమునకు ధూపము.
కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు.
కోరికలు కొండలెక్కుతుంటే అదృష్టాలు అడుగంటుతుంటాయి.
కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట.
కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు.
కొత్తొక వింత పాతొక రోత.
కోరు గింజలు కొంగులోకే సరి.
గంగలో మునిగినా కాకి హంస అవుతుందా.
గంతకు తగిన బొంత.
గంధము అమ్మినచోట కట్టెలు అమ్మినట్లు.
గతికితే అతకదు.
గచ్చ పొద మీద యిసుక వేసి కయ్యానికి పిలుస్తున్నది.
గడ్డ పలుగులు గాలికి కొట్టుకొని పోతూవుంటే, పుల్లాకు నా పని ఏమి అన్నదట.
గడ్డము కాలి ఒకడు ఏడుస్తూ వుంటే, చుట్టకు నిప్పుయిమ్మని ఒకడు వెంబడించినట్టు.
గతిలేనివాడు గాడిదకాళ్ళు పట్టుకున్నట్లు.
గడ్డివాములో సూది వెదికినట్టు.
గతిలేనమ్మకు గంజే పానకం.
గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే.
గాజుల బేరం భోజనానికి సరి.
గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట.
గుడి మింగే వాడికి నంది పిండీమిరియం.
గుర్రాన్ని నది వరకు తీసుకెళ్లగలం కాని నీరు తాగించలేం
గుడినీ గుడిలో లింగాన్నీ మింగినట్లు.
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు.
గుడ్ల మీద కోడిపెట్ట వలే.
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట .
గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు.
గురువుకు పంగనామలు పెట్టినట్లు
గొంతెమ్మ కోరికలు.
గోరు చుట్టు మీద రోకటి పోటు.
గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు.
గుడ్డి కన్నా మెల్ల మేలు.
గుడ్డెద్దు చేలో పడ్డట్టు...
గోటితో పోయేదానికి గొడ్డలెందుకు.
గురువులేని విద్య గుడ్డి విద్య.
గూట్లో దీపం నోట్లో ముద్ద.
గడిచి బ్రతికామని గంతులు వేయకూడదు.
గతుకులకు పోతే, బతుకులు పోయినవి.
గాడిద గాడిదే, గుర్రము గుర్రమే.
గోరుచుట్టుపైన రోకలి పోటు.
No comments:
Post a Comment