ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి
అమ్మపాట పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!
సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవభాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయే తేట తెలుగు నందు
వేలవేల కవుల వెలుగులో రూపొంది
దేశదేశములను వాసిగాంచి
వేయియేండ్ల నుండి విలసిల్లు నా భాషా
దేశభాషలందు తెలుగు లెస్స!
No comments:
Post a Comment