Wednesday, September 15, 2010

తేనెల తేటల మాటలతో

తేనెలతేటల మాటలతో

మనదేసమాతనే కొలిచెదమా

భావం, భాష్యం చూసుకొని

సుఖజీవనయానం చేయుదమా ||తేనెల||


సాగరమేఖల చుట్టుకొని

సురగంగ చీరలా మలచుకొని

స్వేచ్చగానం పాడుకొని

మనదేవికి ఇవ్వాలి హారతులు ||తేనెల||

గంగజఠాధర భావనలో

హిమశైల రూపమే నిలుపుకొని

గలగలపారే నదులన్ని

ఒక బృందగానమే చేస్తూవుంటే ||తేనెల||

ఎందరో వీరుల త్యాగఫలం

మననేటి స్వేచ్చకు మూలబలం

వారందరిని తలచుకొని

మనమానసవీధిని నిలుపుకొని ||తేనెల||

No comments: