Tuesday, April 12, 2011

ayurvedic tips


జలుబు:
[1].దాల్చిన చెక్కను నీటితో సాది గంధం తీసి ఆ గంధాన్ని కనతలకు పట్టు వేస్తూ వుంటే జలుబు,తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధిచిన తలనొప్పి తగ్గుతాయి .
[2].వేపాకులు 10 gm లు ,మిరియాలు 5gm లు .ఈ రెండు కలిపి మెతగా నూరి గురి గింజ అంత టాబ్లెట్ ఆరబెట్టి , 3 పూటల 3 టాబ్లెట్ వేస్తూ వుంటే జలుబు పోతుంది.
[3].మునగాకు రసం ,మిరియాలు కలిపి నూరి తలకు పట్టీ వేస్తె జలుబు పోతుంది.
[4].వాకుడు వేర్లు దంచి కాషాయం చేసి అరపావు లీటర్ కషాయంలో ఒక gm పిప్పల్ల చూర్ణము 30 gm తేనె లో కలిపి పుటకు ఒక మోతతుగా రెండు పూటల తాగుతూ వుంటే అన్ని రకాల జలుబు,దగ్గు,పడిశం పోతుంది



దగ్గు:
[1].అరటి(బనానా) పండు మధ్యలో 1gm మిరియాల చూర్ణం వుంచి ,ఆ పండు తింటూ వుంటే ఎంత కాలం నుండి వున్నా దగ్గులైన పోతాయి.
[2].అతిమధురం,దోరగా వేయించిన మిరియాలు,కచురాలు ఈ మూడింటిని సమబగాలుగా గ్రహించి దంచి చూర్ణం చేసుకుని ,రోజు అర లీటర్ మంచి నెల్లల్లో 15gm చూర్ణం కలిపి పావు లీటర్ కాషాయం మిగిలేల మరగబెట్టి వడగట్టి , చల్లార్చి పూటకు పావు లీటర్ మోతాదుగా పటికే బెల్లం పొడి కలుపుకొని తాగుతూ వుంటే అన్ని రకాల దగ్గులు పోతాయి.
[3].అడ్డరసం ఆకుల కషాయము 640gm పంచదార 640gm తీసుకుని పాకము పట్టి అందులో 80gm పిప్పలి చూర్ణము 80gm పాత నెయ్యి కలిపి లేహ్య పాకముగా చేసుకుని పాత్ర దించి ,చల్లార్చిన తరువాత అందులో 640gm తేనె కలిపి నిలువ వుంచుకోవాలి.పూటకు 6gm లేహ్యం చొప్పున రెండు పూటల తింటూ వుంటే అన్ని రకాల దగ్గులు పోతాయి.
[4].వాకుడు వేర్లు దంచి కాషాయం చేసి అరపావు లీటర్ కషాయంలో ఒక gm పిప్పల్ల చూర్ణము 30 gm తేనె లో కలిపి పుటకు ఒక మోతతుగా రెండు పూటల తాగుతూ వుంటే అన్ని రకాల జలుబు,దగ్గు,పడిశం పోతుంది


తల నొప్పి:
[1].దాల్చిన చెక్కను నీటితో సాది గంధం తీసి ఆ గంధాన్ని కనతలకు వేస్తూ వుంటే తలనొప్పి ముక్యంగా నరాలకు సంబంధిచిన తలనొప్పి,జలుబు పోతాయి.
[2].నువ్వుల నూనె 72gm శొంటి 6 gm అతిమధురం 6gm ఈ మూడింటిని మెతగా చూర్ణం చేసి నువ్వుల నూనె లో వేసి బాగా వేగిన తరువాత దించి వదపోసుకుని నిలువ చేసుకోవాలి.ఒంటి తలనొప్పి వచ్చే సమయానికి తలకు ఈ నోనేతో మర్దన చేసిన ఎంత దారుణ మయిన తలనొప్పి అయిన పోవును.రెండు మూడు రోజుల కు ఒకసారి స్నానం చేయవలెను.స్నానం చేసిన తరువాత పగటి నిద్ర ,స్త్రీ సంపర్కం , చలువ చేయు పదార్దములు వాడరాదు.
[3].బెల్లము,శొంటి సమంగా కలిపి మాటిమాటికి వాసన చూస్తూ వుంటే తలనొప్పి తగ్గి పోతుంది.
[4].తినే ఉప్పు,పాటికే బెల్లం ఈ రెండు సమంగా కలిపి మెత్తగా నూరి నిలువ ఉంచుకుని,రెండు పూటల 2gm పొడిని గోరువెచని నేతిలో వేసుకుని తాగుతూ వుంటే తలనొప్పులు తగ్గిపోతాయి


కడుపు నొప్పి:
[1].ఒక నెలలో 1 స్పూన్ సోడా ఉప్పు కలిపి తాగితే మంత్రిన్చినట్లుగా కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
[2].దాల్చిన చెక్క అరకు తెచుకుని , అయిదారు చుక్కలు నీటిలో వేసి త్రాగితే కడుపు నొప్పి , అజీర్ణం ,దగ్గు , ఒగర్పు ,తగ్గుతాయి . ఇంకా ఈ అరకు ఉపయోగించడ వల్ల అతిసార విరేచనాలు, నీళ్ళ విరేచనాలు తగ్గిపోతాయి.
[3].వాము వాటర్ ఒకటి లేదా రెండు ఔన్సుల మోతాదుగా అవసరన్న్ని బట్టి తాగుతూ వుంటే కడుపు నొప్పి ఉబ్బరం తగ్గిపోతాయి


చర్మ రోగాలు:
[1].ఒళ్ళు దురద:
వాము 20 gm ,పసుపు 10gm, పోడించిన వెల్లి గారము 10gm .ఈ మూడు కలిపి మంచి నీటితో మెతగా నూరి దురద ఉన్న చోట మర్దన చేస్తూ వుంటే , 5 లేదా 6 రోజుల్లో ఎంత మొండి దురధలైన హరిన్చిపోతై . వంటికి లేపనం చేసిన తరువాత 2 గంటలు ఆగి స్నానం చేయాలి.వేడిచేసే పదార్ధాలు ,వంకాయ ,కోడి మాంసం , కోడి గుడ్డు పనికి రావు.
[2].తామర:
వాము 100gm , జిల్లేడు పాలు 200gm ,తీసుకుని రెంటిని కలిపి మెతగా నూరి ఉంచాలి.నువ్వుల నూనె 100gm, బాండి లో పోసి నూనె వేడెక్కిన తరువాత పైన తయారైన వాము జిల్లేడు పాల మిశ్రమాన్ని కొంచెం కొంచెం పకోడీ వలె నూనె లో అవి నల్లగా మాడి పోయే వరకు వుంచి ,ఆ నూనె ను వడ పోసి నిలువ వుంచుకోవాలి.రోజు రెండు పూటల తామర వున్నా చోట ఈ తైలాన్ని మర్దన చేస్తూ వుంటే క్రమంగా తప్పకుండ తామర రోగం పోతుంది.
[3].శీతాఫలం ఆకు ,తుమ్మకు ,తులసి ఆకు ,వేపాకు ఇవి సమ బాగాలు తీసుకుని మెతగా రుబ్బి అందులో మేక పాలు , వంట కర్పూరం కలిపి మెత్తగా పేస్తే లాగా చేసుకుని వాడితే చర్మ రోగాలు అన్ని పోతాయి.
[4].చిత్ర మలం వేరు ,జిల్లేడు చెక్క ,తన్తేపు గింజలు వీటిని సమబగాలుగా గ్రహించి 3 రోజులు మజ్జిగలో నానబెట్టి ,మెతగా నూరి తామర మీద లేపనం చేస్తే ఎంత కల నుంచి వున్నా తామర అయిన తగ్గి పోతుంది.
[5].శరీరమంత దురదగా జిలగా వున్నా వారు వేప చిగుళ్ళు పసుపు కలిపి కొంచెం మంచి నీటితో మెత్తగా నూరి ఆ పేస్తే ను వంటికి పట్టించుకుని ఎండిన తరువాత స్నానం చేస్తూ వుంటే ,చర్మం ఫై దురదలు ,ధదుర్లు పోతాయి.
[6].దురదగా వున్నవారు కలబంద గుజ్జును నీటిలో కడిగి దానిలో పసుపు కలిపి నూరి లేపనం చేసి వాడితే దురదలు పోతాయి.
[4].స్కిన్ ఎలేర్గి ఉన్నవారు అల్లం ,ధనియాలు ,జీలకర్ర ,వాము ,తులసి ,నిమ్మరసం ,తేనె కలిపి సేవించిన కొన్ని పూతలలోనే స్కిన్ ఎలర్జీ పోతుంది.
[5].పాచి పొగాకు మొల మీద లేచిన గజ్జి పైన చుట్టి పైన బుట్ట కట్టుకుంటే మొల గజ్జి హరించి పోతుంది.
[6].పత్తి వేరును ,పతి పూవులను కలిపి నూరి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ వుంటే చర్మ రోగాలు తగ్గిపోతాయి.
[7].అతి మధురం చూర్ణం పూటకు 5gm మోతాదుగా పాలలో లేక తేనె తో కలుపు కొని 2 పూటల సేవిస్తూ వుంటే ఇంగ్లీష్ మందులు అతిగా వాడటం వాళ్ళ వచ్చిన ఎలేర్జి తో వచ్చే ధదుర్లు పోతాయి
.

కీళ్ళ నొప్పులు:
[1].బెల్లము ,శుది చేసిన గుగ్గిలం ,ఈ రెండు సమ బాగాలుగా కలిపి దంచి రేగి పండంత టాబ్లెట్ చేసికొని పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల కొంచెం నెయ్యిలో కలిపి సేవిస్తూ వుంటే కీళ్ళ నొప్పులు ,చీల మండల నొప్పులు తగ్గి పోతాయి.
[2].వాము ,శుద గుగ్గిలం ,మల్కంగిని గింజలు ఈ మూడు సమంగా కలిపి మెతగా దంచి ,నీటితో నూరి సెనగ గిన్జలంత టాబ్లెట్ చేసి గాలికి ఆరబెట్టి నిలువ చేసుకుని , పూటకు 3 టాబ్లెట్ చొప్పున మంచి నీటితో వేసుకుని అమపనగా 1 కప్పు వేడి పలు తాగాలి ఇలా రెండు పూటలు చేస్తూ వుంటే కీళ్ళ నొప్పులు ,కాళ్ళ నొప్పులు ,నరాల నొప్పులు మొదలైన వాత సమస్యలు పోతై .
[3].వేప నూనెలో జిల్లేడు వేరు చూర్ణము కలిపి కీళ్ళ మీద మర్దన చేస్తూ వుంటే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
[4].పొగాకు చిగురాకులు ,ఆముదపు చెట్టు చిగురాకులు ,ఉమ్మెత చిగురాకులు ,జిల్లేడు చిగురాకులు ఈ 4 సమ బాగాలుగా తీసుకుని మెతగా నూరి శనగ గిన్జలంత మాత్రలు చేసి నీడలో ఎండబెట్టి నిలువచేసుకోవాలి.ఈ టాబ్లెట్ ను 2 పూటల పూటకు 1 వేసుకుంటూ వుంటే కీళ్ళ వాతం తగ్గుతుంది.ఇది ప్రసిద్ధు లైన ఆయుర్వేద వైద్యుల చేత చేయించుకుని వారి పర్యవేక్షణలో వాడుకోవాలి.
[5].పొగాకు 120gm తీసుకుని ముక్కల కింద నలగగొట్టి ఒక లీటర్ నీటిలో వేసి 1 రోజంతా నానబెట్టాలి .తరువాత ఆ పొగాకును బాగా పిసికి గుడ్డలో వడపోసి ఆ నీరు గ్రహించాలి .ఆ నీరు ఎంత ఉంటె అంత నువ్వుల నువ్వుల నూనె మిగిలేవరకు మరగబెట్టి దించి వడపోసి ,నిలువ ఉంచుకుని రోజు 2 పూటల ఈ తైలముతో నొప్పులున్న చోట మర్దన చేసుకుంటూ ఉంటె అతి త్వరగా కీళ్ళ నొప్పులు హరిన్సిపోతై.
[6].వాము వేదనతో కూడుకోనియున్న మునగాకును దంచి నూనెలో ఉడికించి కీళ్ళ పై వేసి కట్టాలి.
[7].లేతగా ఉన్న ప్రతి ఆకును మెత్తగా దంచి ఆముదంతో గాని ,ఆవునేయ్యితో గాని ఉడికించి కీళ్ళ మీద వేసి కట్టు కడుతూ వుంటే కీళ్ళ నొప్పులు తగ్గి పోతాయి


వాంతులు:
[1].తేనె 20gm ,దోరగా వేయించి దంచిన జీలకర్ర చూర్ణము 3gm కలిపి ఒక మోతదుగా రోజుకు 3 లేక 4 లేక 5 సార్లు వ్యాధి తీవ్రత బట్టి వాడుతూ వుంటే వ్యాధులు తగిపోతై .
[2].కరక్కాయ , శొంటి పిప్పలు , మిరియాలు , ధనియాలు ,జీలకర్ర వీటిని సమబగాలుగా తీసుకుని దోరగా వేయించి రోజు 2 లేక 3 పూటలు 3 gm పొడి ఒక స్పూన్ తేనె తో కలిపి సేవిస్తూ ఉంటె వాంతులు ఆగుతాయి.
[3].బెల్లము , జీలకర్ర సమంగా కలిపి దంచి ,ఉసిరికాయంత ఉండలు చేసుకుని రోజు 4 లేక 5 సార్లు తింటూ ఉంటె వంతులు ఆగుతాయి.


విరేచనాలు:
[1].బెల్లం , ఆవాలు సమ బాగాలుగా తీసుకుని మెత్తగా నూరి ,బట్టాని గింజ లంత టాబ్లెట్ చేసి పూటకు ఒక టాబ్లెట్ చొప్పున మంచి నీళ్ళల్లో 3 పూటల వేసుకుంటూ ఉంటె నీళ్ళ విరేచనాలు తప్పకుండ తగ్గుతాయి.
[2].వాము 10gm ,పొంగించిన ఇంగువ 3gm , తెల్ల కాచు 5gm ,వేప బంక 3gm, పాత బెల్లం 20 gm ,వీటన్నింటిని కలిపి పెరుగుతో మెతగా దంచి గాలికి ఆరబెట్టి నిలువ చేసుకోవాలి .మాత్రలు పూర్తిగా ఆరాలి .రోజు పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటల మంచి నీటితో వేసుకుంటూ వుంటే , కడుపు నొప్పితో కూడిన విరేచనాలు 2 ,3 రోజుల్లో తగ్గిపోతాయి .ఆహారంలో ఉప్పు కారం పనికిరావు.
[3].రెండు ఔన్సుల వాము వాటర్ మంచి నీటిలో కలిపి తాగితే నీళ్ళ విరేచనాలు ఆగి పోతాయి.
[4].ఆవాలు , బెల్లం కలిపి మెత్తగా నూరి 5gm , తబ్లేట్ట్స్ చేసి పూటకు ఒక టాబ్లెట్ చొప్పున 2 పూటల వేసుకున్న నీళ్ళ విరేచనాలు ఆగి పోతాయి.
[5].వేపాకులు కొంచెం నీళ్ళతో మెతగా నూరి రసం పిండి గుడ్డలో వడపోసి ,10gm రసములో 5gm,పటిక బెల్లం పొడి కలిపి 2 పూటలా తాగితే నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి.
[6].అరటి పండును పటిక బెల్లంతో అద్దుకొని తింటూ ఉంటె నీళ్ళ విరేచనాలు తగ్గుతాయి


జ్వరం:
[1].బెల్లం 20gm ,తీసుకుని దానిలో జీలకర్ర చూర్ణం గాని , వాము చూర్ణం గాని , కొంచెం దోరగా వేయించి దంచి పూటకు ఒక మోతాదుగా 2 పూటల తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గిపోతాయి.
[2].ఉప్పు ,మిరియ్లు , పిప్పింటకు[మూర్కొండకు] , ఈ మూడు సమంగా గ్రహించి కచపచగ నలగగొట్టి గుడ్డలో వేసి మూట గట్టి దాన్ని వాసన చూస్తూ వుంటే చలిజ్వరం రాకుండా వుంటుంది.
[3].వాము పొడి 6gm , పాత బెల్లం 20gm ,కలిపి పూటకొక మోతాదు చొప్పున దంచి 2 పూటల తింటూ వుంటే విషమ జ్వరాలు తగ్గిపోతాయి


చెవి:

[1].ఆయుర్వేద మూలికలు అమ్మే దుకాణాల్లో కురసాని వాము తెచ్చుకుని నేలలతో మెత్తగా నూరి గుడ్డలో వడ పోసి , ఆ రసంలో కొంచెం తేనె కలిపి ఆ రసాన్ని చీము కారుతున్న చెవిలో నాలుగు చుక్కలు వేస్తూ ఉంటె అతి త్వరగా చీము కారడం తగ్గి పోతుంది .
[2].వాము 2 చిటికెలు ,తమలపాకులు 2 ,కలిపి దంచి రసం తీసే వడ పోసి నాలుగు చుక్కలు 2 పూటల వేస్తూ ఉంటె చెవి పోటు తగ్గి పోతుంది.
[3].వాము 50gm తీసుకుని శుబ్రం చేసి ఆ వామును పావు లీటర్ నీటిలో కలిపి మెతగా రసం వచేలా నూరి ,ఆ రసంలో నువ్వుల నూనె 100gm కలిపి మట్టి పాత్రలో పోసి చిన్న మంట మీద నీరు ఇరిగి పోయి నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి దించి వడపోసి ఆ నూనేనిలువ ఉంచుకుని రోజు 2 పూటలు పూటకు 4,5 చుక్కలు చెవిలో వేస్తూ వుంటే క్రమంగా చెవుడు తగ్గిపోతుంది.
[4].వేపాకును కొంచెం నలగగొట్టి నీటిలో వేసి బాగా మరిగించి దించి, దానిని ఆవిరిని చెవులకు పట్టిస్తూ ఉంటె చెవి నొప్పి వెంటనే తగ్గి పోతుంది.
[5].పొగాకును నీటితో తడిపి రసం తీసి వెచ చేసి వడపోసి చెవుల్లో 3 ,4 చుక్కలు వేస్తూ ఉంటె చెవి వ్యాధులన్ని పోతాయి.
[6].వాకుడు వేరు ,ఆవాలు సమంగా కలిపి చూర్నంచేసి ఆ చూర్ణాన్ని నిప్పుల మీద వేసి ఆ పొగను చెవులకు పట్టిస్తే , ఆ పొగ తగలగానే చేవులోని క్రిములు జల జల కింద పడి పోతాయి .
[7].ఆముదపు ఆకులను నిప్పులపైన వెచ చేసి దంచి రసం తీసి ,దానితో సమానంగా అల్లం రసం ,నువ్వుల నూనె , అతి మధురం ,ఉప్పు ,కలిపి తైలం మిగిలే వరకు చిన్న మంట మీద మరగ బెట్టి వడపోసి ,ఆ నూనె ను చెవిలో 5చుక్కలు వేస్తె వెంటనే చెవి పోతూ తగ్గి పోతుంది.


అల్సర్:

[1].పాత బెల్లం , అల్లం ,నువ్వులు సమంగా దంచి పూటకు ఉసిరి కాయంత ముద కొద్ది కొద్దిగ తింటూ వుంటే అల్సర్ తగ్గుతుంది.
[2].అల్లం , బెల్లం , నువ్వులు సమపాళ్ళల్లో కలిపి వాడినా అల్సర్ తగ్గుతుంది.


కన్నులు:
[1].కలబంద లో పాతిక కలిపి కళ్ళల్లో పోసిన కంటి దెబ్బలు పోవును. [2].స్పోటకము వచ్చిన అరికాళ్ళకు గోరింటాకు పెట్టిన కళ్ళకు ప్రమాదకరమైన జబ్బులు చేయవు.
[3].పేద కానుగ కాయలను నల్ల ధారమునకు గుచ్హి చిన్న పిల్లల మేడలో కట్టిన కంటి జబ్బులు నివారించును.
[4].కంటి లోని మురికి తోలిగించుటకు చింత గింజను తేనె తో గంధము తీసి పచ కర్పూరము చేర్చి కన్ను యన్దున్చావలెను.
[5].2 మాసముల ఎత్తు పటక పొడి కలిపినా నీటిని కండ్లలో వేసినచో కండ్లలోని మురికి తొలిగి కంటి గాయములు మానును.

కండ్ల కలకల నివారణకు:

[1].రోజుకు ఒక నువ్వు పోగు చొప్పున పువ్వులను వారం రోజు లు సేవించిన కండ్ల కలకలు రావు .కండ్ల కలకలు వచ్చిన తరువాత సేవించిన నిరోధముగావించును.
[2].నంది వర్ధనము పువ్వుల రసమును కళ్ళల్లో వేసిన కళ్ళ కలకల నివారణమగును.
[3].బాగుగ కాగిన నీటిలో రెండు గురి గింజ ల ఏతు లో నల్ల మందు ను వేసి ఆవిరిని కళ్ళకు పట్టించిన కళ్ళ కలకల హరించును.
[4].నందివర్ధనము ఆకు పసరును పోయవలెను.
[5].నీరుల్లిపాయ ను నూరి రసమును తీసి పోయవలెను.
[6].కనుగోటి వితులను పొడి చేసి వేడి నీటిలో అరగ తీసి కంటిలో వేయవలెను.
[7].కంటి కలకల ప్రారంబ దశలో నువ్వుల నూనె ను కంటి లో 1,2 చుక్కలను వేయవలెను .
[8].గోరువెచని పసుపు కషాయంలో పలుచటి నూలుగుడ్డ ముంచి కొద్దిగా పిండి ఆ గుడ్డను కళ్ళ పై వేస్తూ ఉంటె కళ్ళ కలకల తగ్గి పోతాయి .
[9].కలబంద మట్టలలోని గుజ్జు ను నీటితో కడిగి తెల్లని గుడ్డలో వేసి కొంచెము పాచి పాతిక పొడిని ,నల్లమంధులను చేర్చి పొట్లము కట్టి కళ్ళకు అద్దుకొనవలెను.
[10].ఉక్కు రసము ,నిమ్మకాయ బద్ధ పై వేసి తెల్ల బట్టతో మూటను కట్టి కళ్ళకు అదుముకునుచున్దవలెను


అజీర్ణం:

[1].వాము ,మిరియాలు ,ఉప్పు , సమపాళ్ళల్లో , కలిపి దోరగా వేయించి పొడి చేసి పరగడుపున 3 వేళ్ళకు వచ్చునంత సేవిన్చకాలేను.
[2].2 చింత గింజలను పెనం పై వేసి కాల్చి ఫై పొట్టు గీకి వేసి నోటిలో వేసుకుని నమిలి మింగిన అజీర్ణం పోవును.
[3].40gm ల నిమ్మరసం లో జీలకర్ర 3gm, సైంధవ లవణము 3gm, అల్లపు ముక్కలు 10 gm వేసి 3 గంటలు నానబెట్టి ప్రతి రోజు ఉదయము తినవలెను.
[4].దాల్చిన చెక్క , యాలకులు వేయించిన మిరియాలు సమపాళ్ళల్లో కలిపి పొడి చేసి పూటకు 3 gm చొప్పున బెల్లం తో కలిపి పుచుకోన వలెను.
[5].నీరుల్లిపయను ముక్కలుగా కోసి బోజన సమయంలో తినవలెను.
[6].నేతితో వండిన అన్నమును బుజించిన చక్కగా జీర్ణం అగును.
[7].నిమ్మరసంలో తినే సోడా ను 5gm లు కలిపి ఒక ఔన్సు తాగవలెను.
[8].పంచదార లేక బెల్లపు పానకమును తీసుకొనవలెను.
[9].రాత్రి రాగి పాత్రా లో ఉంచిన నీటిని ఉదయం పరిగడపున తాగవలెను.
[10].రోజు బోజనానికి ముందు 2 చిటికెలు దాల్చిన చెక్క పొడి ,2 చిటికెలు శొంటి పొడి , 4 చిటికెల యాలక గింజ ల పొడి కంచెం మంచి నీళ్ళల్లో కలిపి తాగుతూ వుంటే అజీర్ణ ,అసనం లోని తెపులు తగ్గిపోతాయి .
[11].మునగాకు రసం కొంచెం లవణం కలిపి పిల్లలకు తాగిస్తే అజీర్ణ వ్యాధి తగ్గుతుంది.
[12].వాకుడు వేరు , అడ్డ రసం వేరు , తిప తీగ ఒక్కొక్కటి 40 gm ల చొప్పున తీసుకుని 600gm నీటిలో వేసి 75gm కాషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి చల్లార్చి తాగితే అజీర్ణం పులి తేనుపులు పోతాయి.
[13].ఉదయం పూట అల్లం ముక్కను నీళ్ళు కలిపి దంచి రసం తీసి నిలువ ఉంచితే పైన మంచి రసం తేరుకుంటుంది దానిని 2 స్పూన్ ల మోతాదుగా తీసుకుని దానిలో 1 స్పూన్ సైంధవ లవణం కలిపి రోజు తినాలి
.

అరుచి:
[1].కాల్చిన అల్లపు ముక్కను ఉప్పు తో అది తినవలెను.
[2].ఆవాలను నూరి నాబిపైన ప్రతిరాత్రి పట్టు వేయవలెను.
[3].అల్లపు రసములో తేనె ను కలిపి నాకవలెను.
[4].కరక్కాయ కాల్చిన బెరడును నోట బెట్టుకుని రాత్రి పరున్దవలెను.
[5].బోజనమున మొదటి ముద్హలో కాల్చిన శొంటి పొడి ఉప్పు తో కలిపి తినవలెను .


బొల్లి:
[1].వెమ్పాలి చెట్టు బెరడును మెతగా నూరి వస్త్ర గాలితం పట్టి రోజులు 2 తులముల చొప్పున 15 రోజులు తినిపించి రోగికి గాలి తగలకుండా కూర్చున్దబెత్తవలెను.ఉప్పు లేని శనగ రొట్టె ఆహారంగా ఇవ్వవలెను.
[2].తుంగ ముస్థలు, దాల్చిన చెక్క , కబబు చిన్ని కషాయమును కాచి 40 రోజు లు పుచుకోనవలెను.
[3].వెలగ ,ఉసిరిక , వేప , చింత ఆకులు మరియు జీలకర్ర , వెల్లుల్లి , మిరప కాయలు , ఉప్పు , సైంధవ లవణము లను చూర్ణము చేసి కొత్త కుండ ఉంచి పూటకు 6gm , చొప్పున 60gm నెయ్యి చేర్చి అన్నముతో 40 రోజు లు సేవించవలెను.
[4].ఈశ్వర వేరు చెక్క రసమును రోజు కు 3gm పుచుకోనవలెను.
[5].ఇప్పపువ్వు 3 వేళ్ళకు వచ్హినంత తీసుకుని ఉదయం , సాయంత్రం చక్కగా నమలి తినవలెను.
[6].మినుములు నూరి రాసిన శ్వేతా కుష్టు నివారనమగును.
[7].మొదట శరీరమునకు నూనె రాసి పిమ్మట రేలా ఆకులు,కామంచి ఆకులు మజ్జిగతో నూరి నలుగు పెట్టుచున్దవలెను.
[8].వేపకాయలు , ఆకులు , పువ్వులు బాగా నూరి అర తులము పూటకు పుచుకోనుచు 4 రోజు లు సేవించవలెను.
[9].నల్ల త్రాచు కుబుసమును మసి చేసి దానితో తాడికాయ పొడి నూనె లో కలిపి పూయవలెను.
[10].రోగి పురుషుడైన స్త్రీ రురక్తమును శ్వేతా కుష్టు మచల ఫై పూయవలెను.
[11].రోగి స్త్రీ అయిన పురుషుని ఇంద్రియమును మచల ఫై పూయవలెను ఇట్లు చేసిన మచ లు శాశ్వతముగా పోవును.
[12].మంచి పసుపు కొమ్ములను బ్రహ్మ జెముడు చెట్టు మొదట్లో గుచ్హి ౩ రోజులు నానబెట్టి తరువాత ఎండ బెట్టాలి.మల్లి బ్రహ్మజెముడు మొదట్లో గుచ్హి 3 రోజులు ఉంచి తీసి ఎండా బెట్టాలి.ఇలా 7సార్లు చేసిన తరువాత ఆ పసుపు కొమ్ము ను నీటితో అరగ తీసి ఆ గంధాన్ని పైన లేపనం చేస్తూ ఉంటె బొల్లి ,మేహపోడల మచలు , ఇంకా సకల చర్మ వ్యాధులు పోతాయి.

No comments: