Monday, September 20, 2010

జె.ఎల్. పరీక్షల ప్రత్యేకం

1) ‘సుమతి’ శతక కర్త ఎవరు?
1. బద్దెన 2. వేమన 3. మారద వెంకయ్య 4. పోతన
2) రంగనాథ రామాయణంలోని ఛందస్సు ఏది?
1. కందము 2. ద్విపద 3. చంపకమాల 4. ఆటవెలది
3) ‘్భక్తి కవి’ ఎవరు?
1. పోతన 2. తిక్కన 3. నన్నయ 4. శ్రీనాథుడు
4) ‘బాల వ్యాకరణ’ గ్రంథకర్త ఎవరు?
1. పోతన 2. మంచెన 3. చిన్నయసూరి 4. నారాయణకవి
5) ‘ముత్యాల సరాల’లోని మాత్రల సంఖ్య?
1. పనె్నండు 2. పదమూడు
3. ఇరవై రెండు 4. పధ్నాలుగు

6) సాక్షి వ్యాసాల రచయిత ఎవరు?
1. గురజాడ అప్పారావు
2. చిలకమర్తి లక్ష్మీనరసింహం
3. పానుగంటి లక్ష్మీనరసింహారావు 4. శ్రీశ్రీ
7) ‘మాలపల్లి’ నవల ఏ సంవత్సరంలో వెలువడింది?
1. 1920 సం. 2. 1922 సం.
3. 1921 సం. 4. 1930 సం.
8) ‘మట్టిమనిషి’ నవల రచించినదెవరు?
1. లత 2. వాసిరెడ్డి సీతాదేవి
3. ద్వివేదుల విశాలాక్షి 4. అచ్యుతవల్లి
9) ‘చిల్లరదేవుళ్ళు’ నవల ఎవరిది?
1. విశ్వనాథ 2. డాక్టర్ దాశరథి 3. వట్టికోట అళ్వారుస్వామి 4. దాశరథి రంగాచార్య
10) ‘దిగంబర కవిత్వం’ ఏ సంవత్సరంలో వెలువడింది?
1. 1965 సం. 2. 1967 సం.
3. 1969 సం. 4. 1972 సం.
11) తెలుగులో యక్షగానాలపై పరిశోధన చేసినదెవరు?
1. యస్వీ జోగారావు 2. గంటి సోమయాజులు 3. దివాకర్ల వేంకటావధాని
4. సూరవరం ప్రతాపరెడ్డి
12) ‘శివభారతం’ ఏ సాహిత్య మార్గం కిందకి వస్తుంది?
1. నవ్య సంప్రదాయం 2. సంప్రదాయం
3. అభ్యుదయ మార్గం 4. దిగంబర మార్గం
13) ‘తెలంగాణా పల్లె పాటలు’ ఎవరి సంకలనం?
1. ఆచార్య బిరుదరాజు రామరాజు
2. చింతా దీక్షితులు 3. ఆచార్య నాయని కృష్ణకుమారి 4. డాక్టర్ ఎన్.గోపి
14) రంగనాథ రామాయణం వ్రాసిన కవి ఎవరు?
1. తిక్కన 2. కంకంటి పాపరాజు 3. గోన బుద్దారెడ్డి 4. పోతన
15) ‘నవ్వుల గని’ రచించిన కవి?
1. చిలకమర్తి 2. ముళ్ళపూడి వెంకటరమణ
3. పానుగంటి 4. మునిమాణిక్యం
16) ‘శ్రీకృష్ణ లీలా తరంగాలు’ రచించిన కవి ఎవరు?
1. ఆత్రేయ 2. ఆచార్య తిరుమల
3. చైతన్య ప్రభువు 4. నారాయణ తీర్థులు
17) ‘ఆంధ్ర కాళిదాసు’ బిరుదుగల కవి ?
1. రాయప్రోలు 2. గురజాడ 3. పానుగంటి లక్ష్మీనరసింహారావు 4. చిలకమర్తి
18) ఎంకి పాటల కర్త?
1. విశ్వనాథ 2. నండూరి
3. అడవి బాపిరాజు 4. బసవరాజు
19) ‘మా భూమి’ నాటక రచయిత ఎవరు?
1. సుంకర సత్యనారాయణ 2. ఆత్రేయ
3. చిలకమర్తి 4. గురజాడ వెంకట అప్పారావు
20) ‘తెలుగులో కవితా విప్లవాల స్వరూపం’ గ్రంథ రచయిత ఎవరు?
1. కుందుర్తి ఆంజనేయులు 2. వేల్చేరు నారాయణరావు 3. డా. ఎన్.గోపి 4. నాగభైరవ కోటేశ్వరరావు
21) ‘వెలుతురు స్నానం’ కవితా సంపుటి రచయిత ఎవరు?
1. డాక్టర్ ఎన్.గోపి 2. డాక్టర్ అద్దేపల్లి 3. నాగభైరవ కోటేశ్వరరావు 4. ఆరుద్ర
22) ‘వజ్రాయుధం’ గేయ సంపుటి రచయిత ఎవరు?
1. ఆవంత్స సోమసుందర్ 2. డాక్టర్ సి.నారాయణరెడ్డి 3. కొనకళ్ళ వెంకటరత్నం 4. డాక్టర్ ఎన్.గోపి
23) ‘ఎవ్వనిచే జనించు’ ఎవరి రచన?
1. నన్నయ 2. తిక్కన 3. ఎర్రన 4. పోతన
24) వ్యవహారిక భాషోద్యమానికి కృషిచేసినవారు ఎవరు?
1. తిరుపతి వేంకటకవులు 2. అల్లసాని పెద్దన
3. గిడుగు రామమూర్తి 4. శ్రీనాథుడు
25) ‘్భజ రాజీయం’ అనే గ్రంథాన్ని రచించిన కవి ఎవరు?
1. బద్దెన 2. అనంతామాత్యుడు
3. జాషువా 4. తిలక్
26) ‘కామితము’- అనగా?
1. దుఃఖము 2. సంతోషము 3. బాధ 4. కోరిక
27) ‘ఆంధ్ర స్కాట్’ అనే బిరుదు గల కవి?
1. అడవి బాపిరాజు 2. చింతా దీక్షితులు
3. చిలకమర్తి లక్ష్మీనరసింహం 4. శ్రీశ్రీ
28) ‘తెలుగులెంక’ అనే బిరుదుగల కవి ఎవరు?
1. అన్నమయ్య 2. రామదాసు 3. తుమ్మల సీతారామమూర్తి 4. బసవరాజు అప్పారావు
29) ‘ఆంధ్ర కవితా పితామహుడు’ అనే బిరుదుగల కవి?
1. అల్లసాని పెద్దన్న 2. తెనాలి రామకృష్ణ
3. ముక్కు తిమ్మన 4. పోతన
30) ‘తృణము’- అనగా?
1. కట్ట 2. గడ్డి 3. నీరు 4. ఆకలి
31) అచ్చతెనుగు కావ్యం ఏది?
1. క్రీడాభిరామము 2. కన్యక 3. యయాతి చరిత్ర 4. రాజశేఖర చరిత్ర
32) ప్రథమాంధ్ర ఆస్థాన కవి ఎవరు?
1. గిడుగు రామమూర్తి 2. జాషువా 3. విశ్వనాథ సత్యనారాయణ 4. చెళ్లపిళ్ల వేంకటశాస్ర్తీ
33) ఉపమా ధర్మమును ఉపమేయంగా ఊహించుట?
1. ఉపమా 2. రూపకం
3. అతిశయోక్తి 4. ఉత్ప్రేక్ష
34) ‘శ్రీ కాళహస్తీశ్వర’ శతక కర్త ఎవరు?
1. తిక్కన 2. ధూర్జటి 3. కాసుల పురుషోత్తమకవి 4. నన్నయ
35) చరిత్రకు అందుతున్న తొలి తెలుగుపదం ఏది?
1. నాగ 2. నాగబు 3. నాగలి 4. నాలిక
36) కవిజనాశ్రయకర్త ఎవరు?
1. మల్లియ రేచన 2. నన్నయ
3. తిక్కన 4. పోతన
37) ‘కుమార సంభవం’ గ్రంథకర్త ఎవరు?
1. ననె్నచోడుడు 2. తిక్కన
3. పాల్కురికి సోమన 4. ఎర్రన
38) ‘పండితారాధ్య చరిత్ర’ వ్రాసిన కవి ఎవరు?
1. పాల్కురికి సోమన 2. ననె్నచోడుడు 3. మల్లికార్జున పండితారాధ్యుడు 4. పోతన
39) ‘శివకవి యుగం’ ఏ శతాబ్దికి చెందినది?
1. క్రీ.శ.12 2. క్రీ.శ.13 3. క్రీ.శ 15 4. క్రీ.శ 16
40) దశకుమార చరిత్రను ఎవరు రచించారు?
1. కేతన 2. పోతన 3. నన్నయ 4. తిక్కన
41) ‘గీరతం’ వ్రాసింది ఎవరు?
1. పోతన 2. నన్నయ
3. తిక్కన 4. తిరుపతి వేంకటకవులు
42) ‘మనసు కవి’గా పేరుపొందిన కవి ఎవరు?
1. ఆత్రేయ 2. ఆరుద్ర 3. డా.సి.నారాయణరెడ్డి
4. డా. ఎన్.గోపి
43) తెలుగు కవుల్లో బ్రాహ్మీదత్త వరప్రసాదుడు ఎవరు?
1. శ్రీనాథుడు 2. శ్రీశ్రీ 3. ఆరుద్ర 4. డా.సినారె
44) ‘ఎర్రన కాలం’ ఏది?
1. 13వ శతాబ్దం 2. 14వ శతాబ్దం 3. 16వ శతాబ్దం 4. 11వ శతాబ్దం
45) ‘అభినవ భారతి’ బిరుదుగల తెలుగు కవి ఎవరు?
1. మంచెన 2. శ్రీశ్రీ 3. శ్రీనాథుడు 4. ననె్నచోడుడు
46) ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అన్నది ఎవరు?
1. తిక్కన 2. నన్నయ 3. పోతన 4. శ్రీశ్రీ
47) ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ అనే వ్యాకరణ గ్రంథ రచయిత ఎవరు?
1. నన్నయ 2. తిక్కన 3. ఎర్రన 4. పోతన
48) కేతన గురువు ఎవరు?
1. తిక్కన 2. నన్నయ 3. పోతన 4. విశ్వనాథ
49) ‘గుడిసెలు కాలిపోతున్నాయి’ కవితా సంపుటి రచయిత ఎవరు?
1. శ్రీశ్రీ 2. కాళోజీ నారాయణరావు 3. బోయి భీమన్న 4. గరిమెళ్ళ సత్యనారాయణ
50) ‘కవి సమయాలు’ గ్రంథ రచయిత ఎవరు?
1. డా. ఎన్.గోపి 2. జయధీర్ తిరుమలరావు 3. ఇరివెంటి కృష్ణమూర్తి 4. శ్రీశ్రీ
51) ‘రాతలు-గీతలు’ రచనల సంపుటి ఎవరిది?
1. విద్వాన్ విశ్వం 2. డా.సి.నారాయణరెడ్డి
3. చిలుకూరి నారాయణరావు 4. శ్రీశ్రీ
52) తెలుగులో చాటుకవిత్వం గ్రంథ రచయిత ఎవరు?
1. జి.లలిత 2. కె.సీత 3. కె.గీత 4. విమల
53) ‘జీవనాడి’ రచయిత ఎవరు?
1. వరవరరావు 2. శ్రీశ్రీ 3. తిలక్ 4. అద్దేపల్లి రామమోహనరావు
54) ‘నువ్వు ఎక్కదలచుకొన్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’ అన్న కవి ఎవరు?
1. శ్రీశ్రీ 2. కుందుర్తి ఆంజనేయులు 3. ఆరుద్ర 4. ఆత్రేయ
55) ‘పిల్లి శతకం’ రచయిత ఎవరు?
1. శ్రీశ్రీ 2. బోయి భీమన్న 3. కొఱవి గోపరాజు 4. ఆరుద్ర
56) ఆంధ్ర భోజుడుగా పేరు పొందిన వారెవరు?
1. శ్రీకృష్ణదేవరాయలు 2. రాజరాజనరేంద్రుడు 3. రఘునాథ రాయులు 4. గురజాడ
57) ‘దీపావళి’ గేయ సంపుటి రచయిత ఎవరు?
1. శ్రీశ్రీ 2. మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీ 3. ఆరుద్ర 4. వేదుల సత్యనారాయణశాస్ర్తీ
58) ‘జయవారం’ అని దేనికి పేరు?
1. గురువారం 2. మంగళవారం
3. శనివారం 4. ఆదివారం
59) ‘పూర్ణమ్మకథ’ గేయ రచయిత ఎవరు?
1. గురజాడ 2. శ్రీశ్రీ 3. పింగళి సూరన 4. చిలకమర్తి
60) ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ రచయిత ఎవరు?
1. ఆరుద్ర 2. ఆత్రేయ 3. శ్రీశ్రీ 4. డాక్టర్ ఎన్.గోపి
జవాబులు
1) 1, 2) 2, 3) 1, 4) 3, 5) 4, 6) 3, 7) 3, 8) 2, 9) 4, 10) 1, 11) 1, 12) 1, 13) 1, 14) 3, 15) 1, 16) 4, 17) 3, 18) 2, 19) 1, 20) 2, 21) 3, 22) 1, 23) 4, 24) 3, 25) 2, 26) 4, 27) 3, 28) 3, 29) 1, 30) 2, 31) 3, 32) 4, 33) 4, 34) 2, 35) 2, 36) 1, 37) 1, 38) 1, 39) 1, 40) 1, 41) 4, 42) 1, 43) 1, 44) 1, 45) 1, 46) 2, 47) 1, 48) 1, 49) 3, 50) 3, 51) 1, 52) 1, 53) 1, 54) 3, 55) 2, 56) 1, 57) 4, 58) 2, 59) 1, 60) 1.

No comments: